Home » పవన్ కళ్యాణ్ కి మళ్లీ కుదిరిన హిట్ కాంబినేషన్.. ఈసారి ఎలాగో..!

పవన్ కళ్యాణ్ కి మళ్లీ కుదిరిన హిట్ కాంబినేషన్.. ఈసారి ఎలాగో..!

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఈయన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్ వంటి సినిమాలను చేస్తున్నాడు. తాజాగా ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని హరీష్ శంకర్ సిద్ధంగా  ఉన్నా ఆయన డేట్స్ దొరకక సినిమా ఆలస్యం అయింది. ఈ సినిమా ప్రకటించేసి దాదాపు సంవత్సరం కావొస్తుంది. ఈ మధ్య సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా అవుట్ పుట్ కిరాక్ వస్తుందని అంటున్నారు. 

Also Read :  పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్ల సునామీ.. 3 రోజుల్లో ఎంతంటే ?

Advertisement

అంతే కాదు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ను ఫిక్స్ చేశారట. గబ్బర్ సింగ్  చిత్రానికి కూడా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఎంత హెల్ప్ అయిందో తెలిసిందే. ఆ సినిమాలోని పాటలు అప్పుడు చాలా ట్రెండ్ సృష్టించాయి.   ఇప్పుడు కూడా అంతకుమించి సాంగ్స్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు దేవిశ్రీప్రసాద్. ఇందుకు సంబంధించిన స్పెషల్ వీడియోను నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. హరీష్ శంకర్ దేవిశ్రీని ఆహ్వానిస్తూ.. సినిమా గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈలోపు సాంబా రాసుకో అంటూ డైలాగ్ వస్తుంది. 

Advertisement

Also Read :   సూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా?

Manam News

ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కన్ఫామ్ అయ్యాడు. దీంతో అభిమానులు ఇండస్ట్రీకి హిట్ కాంబినేషన్ మళ్ళీ కుదిరిందని,   ఇక చెడుగుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీగా తెరకెక్కిస్తున్నారు. తెరి రిమేక్ గా మూల కథని మాత్రమే తీసుకొని సినిమా స్క్రీన్ ప్లే మొత్తం హరీష్ శంకర్ తనదైన స్టైల్ లో రాసుకున్నారట. పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ డైరెక్ట్ చేస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేయబోతున్నాడు హరీష్ శంకర్. వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

Also Read :  ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. వీడియో వైరల్ ..!

Visitors Are Also Reading