సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కళా ప్రపంచం. ఈ కళా ప్రపంచంలో బతకాలి అంటే నటన, టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలాంటి ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రస్తుతం విడాకుల ట్రెండింగ్ నడుస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రేమించి.. పెళ్లి చేసుకుంటున్నారు. ప్రధానంగా చాలామంది జంటలు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు.
Advertisement
అంతేకాకుండా మరి కొంత మంది జంటలు వయసుతో సంబంధం లేకుండా లవ్ లో పడుతూ రిలేషన్ ను మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నరేష్ పవిత్ర లోకేష్. ఇక ఈ పేరు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రెండ్ అవుతాయి. వీరిద్దరూ కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అయింది. ఈ సినిమా సమయంలో వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు అంటూ అనేక వార్తలు వచ్చాయి. కానీ చివరకు వాళ్ళు సినిమా షూటింగ్ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నారని తెలిసింది. ఆ విధంగా ఇండస్ట్రీలో ఎంతో సీనియర్ లు అయిన వీరు ఇప్పటికి కలిసే ఉంటున్నారు.
Advertisement
అయితే వీరి రిలేషన్ అందరికీ తెలుసు కానీ వీరిలాగే మరో జంట కూడా ఇండస్ట్రీలో రిలేషన్ మైంటైన్ చేస్తున్నారట. ఇది చాలా సీక్రెట్ గా నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె కోలీవుడ్ లో మంచి మంచి చిత్రాల్లో కూడా నటిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆయనే అని తెలుస్తోంది. అందుకే ఆమె అనేక చిత్రాలు నటిస్తుందని.. ఆమెకు ఆ వ్యక్తి వల్లే అనేక సినిమా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ఆ వ్యక్తికి ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారని, అయితే ఆయన ఈ ఆంటీ అందాల మత్తులో పడిపోయి తన భార్యకు ఆల్రెడీ విడాకులు ఇచ్చేసాడని తెలుస్తోంది. కానీ వీరిద్దరూ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఒక్క దగ్గర సహజీవనం చేస్తున్నట్టు సమాచారం.