Home » అంబానీ, ఆదానీల మధ్య చిచ్చు పెట్టిన BCCI !

అంబానీ, ఆదానీల మధ్య చిచ్చు పెట్టిన BCCI !

by Bunty
Ad

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏమాత్రం ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. ఐపీఎల్ ప్రారంభమైతే చాలు అందరూ… ఆ మ్యాచ్లను చూసేందుకే ఆసక్తి చూపిస్తారు. ఇక 2023 ఐపీఎల్ సీజన్ మరో మూడు నెలల్లోనే ప్రారంభం కానుంది. అలాగే, ఈ సారి మహిళల ఐపీఎల్‌ కూడా ప్రారంభం కానుంది. తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ దాదాపు ఖరారు అయింది. తొలి సీజన్ మార్చి 4 నుంచి షురూ కానుంది. ప్రారంభం మ్యాచ్ ముంబై-అహ్మదాబాద్ జట్ల మధ్య జరగనున్నది.


ప్రీమియర్ లీగ్ మొత్తం 23 రోజుల పాటు కొనసాగనుండగా ఫైనల్ మ్యాచ్ 26న జరగనున్నది. అయితే లీగ్ కు సంబంధించి బిసిసిఐ ఎలాంటి అధికారిక సమాచారం ప్రకటించాల్సి ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నది. లీగ్ మొదటి మ్యాచ్ లో ముంబై, అహ్మదాబాద్ జట్లు తలపడనున్నాయి. ముంబై జట్టు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కి చెందినది. కాగా అహ్మదాబాద్ జట్టు ఓనర్ గౌతమ్ ఆదాని. ఈ మ్యాచ్ లో ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలు పరోక్షంగా పోటీ పడనున్నారు.

Advertisement

Advertisement

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తున్నది. లీగ్ ను ముంబైలోని సిసిఐ, డివై పాటిల్ స్టేడియాల్లో నిర్వహించే అవకాశం ఉంది. వాంఖడే స్టేడియంలో మ్యాచ్లు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే భారత పురుషుల జట్టు మార్చడం ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఆడనున్నది. ఏప్రిల్ లో నిర్వహించే ఐపిఎల్ మ్యాచ్లు ఈ స్టేడియంలో జరగనున్నాయి. ఐపీఎల్ కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది. ఇక ఉమెన్స్ లీగ్ రెండో మ్యాచ్ మార్చి ఐదున బెంగుళూరు, ఢిల్లీ జట్ల మధ్య సిసిఐ స్టేడియంలో జరగనున్నది. టైటిల్ మ్యాచ్ మార్చి 26న జరగనుంది.

read also : Unstoppable With NBK S2 : పవర్ ఫైనల్ పార్ట్ 2 ప్రోమో వచ్చేసింది.. దుమ్ము లేపిన పవన్

Visitors Are Also Reading