Home » యూట్యూబ్ ద్వారా అమర్ దీప్ భార్య సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

యూట్యూబ్ ద్వారా అమర్ దీప్ భార్య సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

ప్రస్తుతం బుల్లితెర సెలబ్రిటీలు అందరూ కూడా ఒకవైపు పలు సీరియల్స్ చేస్తూనే, మరోవైపు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను, అభిమానులను సందడి చేస్తుంటారు. ఇలా ఎంతోమంది సీరియల్ నటీమణులు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రతి నెల లక్షలు సంపాదిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బుల్లితెర సీరియల్ నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తేజస్విని గౌడ ఒకరు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ, కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ.. పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఇక ఇటీవల కాలంలో ఈమె మరొక బుల్లితెర నటుడు అమర్ దీప్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఇలా పెళ్లి తర్వాత ఈమె తెలుగులో సీరియల్స్ చేయకపోయినా, కన్నడ, తమిళంలో వరుస సినిమాలలో నటిస్తూ.. కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈమె కూడా తేజస్విని గౌడ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో వీడియోలను ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కాలంలో ఈమె తన కెరియర్ పరంగా కాస్త బిజీ అయినటువంటి తరుణంలో కొత్త వీడియోలను చేయలేదు. కానీ, ఒకానొక సమయంలో ఈమె వీడియోలకు భారీ స్థాయిలో వచ్చేది ఏకంగా యూట్యూబ్ ఛానల్ లో ఈమెకు 16 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ తేజస్విని గౌడ భారీ స్థాయిలోనే సంపాదించారు. ఒక్కో వీడియోకి మిలియన్ సంఖ్యలో వ్యూస్ రావడంతో నెలకు సుమారు 30 లక్షల రూపాయల వరకు ఈమె ఆదాయం ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ స్థాయిలో సంపాదన ఉండడంతో చాలామంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు. ఇలా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదించడం అంటే సంవత్సరానికి మూడు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఈమె యూట్యూబ్ సంపాదనతో ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా కూడా చేయవచ్చు. అంతలా ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదిస్తున్నారు. ఈమె యూట్యూబ్ సంపాదన తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కాస్త యూట్యూబ్ ఛానల్ పై ఫోకస్ తగ్గించినటువంటి ఈమె తన భర్త వ్యవహారాలన్నింటినీ చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి రావడంతో ఈమె పూర్తిగా తన విషయాలన్నింటినీ పక్కన పెట్టి బిగ్ బాస్ పైనే ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.

 

Visitors Are Also Reading