Home » అల్లు అర్జున్ కోసం రాజమౌళితో గొడవపడ్డ అల్లు అరవింద్.. ఎందుకో తెలుసా ?

అల్లు అర్జున్ కోసం రాజమౌళితో గొడవపడ్డ అల్లు అరవింద్.. ఎందుకో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజమౌళి పేరు మారి మ్రోగిపోతుంది. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు రాజమౌళి. రాజమౌళి సినిమా తీస్తే కచ్చితంగా హిట్ అవ్వం ఖాయం. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నారు. 

ముఖ్యంగా రాజమౌళితో ఒక్కసారైనా సినిమా చేయాలని చాలా మంది హీరోలు ఆశపడుతుంటారు. అలాంటి హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. నిజానికి గతంలోనే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. రాజమౌళి మగధీర సినిమా చేయాలనుకున్నప్పుడు అల్లు అరవింద్ కి ఈ విషయం తెలిసింది. రామ్ చరణ్ తో మూవీ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఆ సినిమాను ఎలాగైనా తన కొడుకుతో చేయించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేసాడు. ఇదే విషయాన్ని రాజమౌళిని కలిసి చెప్పాడు అల్లు అరవింద్.

Advertisement

Advertisement

బన్నితో సినిమా చేస్తే మంచి బజ్ వస్తుందని.. రామ్ చరణ్ కొత్త హీరో కాబట్టి అంతగా ఆడదేమో అనే అనుమానాలను వ్యక్తం చేసాడు అరవింద్. దర్శకుడు రాజమౌళి మాత్రం ఆల్రెడీ తాను రామ్ చరణ్ కి కమిట్ అయ్యానని.. అతనితోనే మగధీర చేస్తానని తెగేసి చెప్పేశాడంట. దీంతో చేసేది ఏం లేక అల్లు అరవింద్ సైలెంట్ అయిపోయాడు. ఇక ఆ తరువాత ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టేందుకు అరవింద్ స్వయంగా ముందుకొచ్చాడు. రాజమౌళి సినిమా తీస్తే కచ్చితంగా ఆ బడ్జెట్ వస్తుందనే నమ్మకం అల్లు అరవింద్ కి ఉంది. ఆశించినట్టే అనుకున్నదాని కంటే భారీగానే లాభాలు వచ్చాయి. 

Also Read :  ఒక్క శత్రువు కూడా లేకుండా జీవించావయ్యా.. తారకరత్నకి హేట్సాప్..! 

Visitors Are Also Reading