Home » జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌.. సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. అవార్డులు పొందిన నటులు వీళ్లే..!

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌.. సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. అవార్డులు పొందిన నటులు వీళ్లే..!

by Anji
Ad

69వ జాతీయ అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ అవార్డు లభించింది. జాతీయ ఉత్తమ స్టార్ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు దక్కింది. పుష్ప మూవీలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నందుకు అల్లుఅర్జున్ కి ఈ అవార్డును అందించారు. జాతీయ అవార్డుల్లో RRR మూవీ కూడా సత్తా చాటింది.  RRR మూవీకి అవార్డుల పంట పండింది. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కేటగిరిలో కీరవాణికి అవార్డు లభించింది. అదేవిధంగా కొరియోగ్రఫీ విభాగంలో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు కింద నాటు నాటు సాంగ్ కి కంపోజు చేసిన ప్రేమ్ రక్షిత్ కి అవార్డు వరించింది.

Advertisement

స్టంట్ కొరియోగ్రాఫర్, స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరిలోనూ అవార్డులు వరించాయి. భారతీయ సినీ ఇండస్ట్రీలోనే ఈ అవార్డులకు ప్రత్యేక స్థానముంది. భారత్ లోని పలు భాషల్లో సినిమాలు చేసే ప్రతీ నటీనటుడికి ఒక్కసారైనా నేషనల్ ఫిలిం అవార్డు అందుకోవాలనే ఆశ ఉంటుంది. ప్రతి ఏడాదిలాగే 2023 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ ఫిలిం అవార్డులను ప్రకటించగా.. అందులో ఎక్కువగా టాలీవుడ్ సినిమాలే సత్తా చాటాయి. బెస్ట్ తెలుగు సినిమాగా ఉప్పెన అవార్డును అందుకుంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్ప చిత్రానికి సంగీతం అందించిన దేవీ శ్రీప్రసాద్ ను వరించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, బెస్ట్ ప్లే బ్యాంక్ సింగర్ గా RRR సినిమాకు అందించిన కాళభైరవ, ఉత్తమ సినీ గేయ రచయితగా కొండపొలం చిత్రానికి రాసిన చంద్రబోస్ ఈ అవార్డులను అందుకున్నారు.

Advertisement

ఉత్తమ హీరోయిన్స్ గా గంగూభాయి కతియావాడి సినిమాలో నటించిన అలియాభట్ కి, మిమీ సినిమాలో నటించిన కృతి సనన్ కి లభించాయి. బెస్ట్ మూవీస్ గా ఉత్తమ హిందీ సినిమా సర్దార్ ఉదమ్, బెస్ట్ గుజరాతీ మూవీ చల్లో షో, బెస్ట్ కన్నడ మూవీ 777 చార్లీ, బెస్ట్ మైథిలీ మూవీ  సమానంతర్, బెస్ట్ మరాఠీ మూవీ ఏక్దా కాయ్ జాలా, బెస్ట్ మలయాళం మూవీగా హోమ్, బెస్ట్ ఒడియా మూవీగా ప్రతీక్ష, ఉత్తమ తమిళం మూవీగా కదైసి వ్యవసాయి, బెస్ట్ తెలుగు మూవీగా ఉప్పెన అవార్డు గెలుచుకున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

చివరి కోరిక తీరకుండానే మరణించిన కైకాల..! ఇంతకీ ఆయన ఆఖరి కోరిక ఏమిటంటే..?

Pushpa 2 : పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా ?

 

Visitors Are Also Reading