ఈ ఇద్దరు నటులు బాలీవుడ్ లో స్టార్ హీరో, హీరోయిన్.. 2022లో పెళ్లి చేసుకొని కొద్దికాలంలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చారు.. అలాంటి స్టార్ కపుల్ రెండో బిడ్డకు కూడా తల్లిదండ్రులు కాబోతున్నారట. ఇంతకీ వారెవరో గుర్తుకు వచ్చిందా.. వారేనండి మనందరికీ తెలిసిన బ్యూటిఫుల్ కపుల్ అలియాభట్ రన్ వీర్ కపూర్.. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమయానం సాగించిన వీరు 2022లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు ఇద్దరు నవంబర్ ఆరో తేదీన పాపకు జన్మనిచ్చిన విషయం చాలా మందికి తెలుసు. ఈ పాపకు రాహ కపూర్ అని నామకరణం చేశారు.
Advertisement
also read:వీరసింహా రెడ్డి లో నటించిన వరలక్ష్మి కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా ? హీరో కంటే ఎక్కువా..?
Advertisement
అయితే వీరి వివాహం నుంచి పాప పుట్టే వరకు అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అలియా భట్ మరోసారి ప్రెగ్నెంట్ అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల అలియా భట్ దుస్తుల కంపెనీ కోసం ప్రచారం చేసినట్టు తెలుస్తున్నది. ఇందులో కొత్త మేటర్నిటీ కలెక్షన్ ను లాంచ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని చూసిన కొంతమంది అలియాభట్ మళ్లీ గర్భం దాల్చిందని భావిస్తున్నారు..
అయితే ఆలియా నిజంగానే గర్భం దాల్చిందా లేదా అనేది వారు అధికారికంగా ప్రకటిస్తే గాని బయటకు రాదు. వారి కెరియర్ పరంగా చూసుకుంటే అలియా భట్ మరియు రన్ వీర్ కపూర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానిలో ఆలియా మరోసారి రన్వీర్ సింగ్ సరసన నటిస్తుంది. ఆమె తొలి హాలీవుడ్ చిత్రం వండర్ ఉమెన్ గాల్ గాడోటుతో కలిసి హార్ట్ ఆఫ్ స్టోన్ కూడా ఈ ఏడాది విడుదల కానుంది. మరి చూడాలి ఈ వార్త నిజం అవుతుందా.. అబద్ధం అవుతుందా..?
also read: