Home » వైర‌ల్ అవుతున్న ఆలీ కూతురి పెళ్లి వీడియో….ఓ రేంజ్ లో జ‌రిగిందిగా..!

వైర‌ల్ అవుతున్న ఆలీ కూతురి పెళ్లి వీడియో….ఓ రేంజ్ లో జ‌రిగిందిగా..!

by AJAY
Published: Last Updated on

ప్రస్తుతం సెలబ్రిటీలు ఏం చేసినా వీడియోలు తీసి యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేస్తూ డ‌బ్బులు సంపాదిస్తున్నారు. దాదాపు సెలబ్రెటీలు అందరికీ సపరేట్ గా యూట్యూబ్ ఛానల్ లు ఉంటున్నాయి. బర్త్డే పార్టీలు, ఫంక్షన్స్, పెళ్లిళ్లు ఇలా తమకు సంబంధించిన వీడియోలను సెలబ్రిటీలు యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు. తాజాగా ఆలీ కూతురు వివాహానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో షేర్ చేశారు.

కమెడియన్ అలీ కూతురు ఫాతిమా వివాహం ఇటీవల జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాహం హైదరాబాదులో ఘనంగా జరగ‌గా టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున సహా ప‌లువురు నటీనటులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే ఫాతిమా పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆలీ భార్య జుబేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ కూతురు పెళ్లి వీడియోను షేర్ చేసింది.

జుబేదా యూట్యూబ్ ఛానల్ కు 6 లక్షల 91 వేల సబ్ స్క్రైబ‌ర్ లు ఉన్నారు. తన కూతురి పెళ్లి షాపింగ్ నుండి హల్దీ ఫంక్షన్, పెళ్లికూతురును రెడీ చేయడం ఇలా ప్రతి వీడియోను షేర్ చేస్తూ వచ్చారు. జుబేదా షేర్ చేసే వీడియోలకు యూట్యూబ్ లో లక్షలలో వ్యూవ్స్ వస్తాయి.

ఇక తాజాగా ఫాతిమా పెళ్లి మండపం ఎలా తయారు చేశారు…? ఎలాంటి భోజనాలు వడ్డించారు.. సాగ‌నంపేట‌ప్పుడు ఎలా ఎమోషనల్ అయ్యారు. ఇలా అన్నింటినీ వీడియో తీశారు. అంతే కాకుండా వీడియోలో చిరు, నాగ్ స‌హా ప‌లువురు సెల‌బ్రెటీలు ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వ్యూవ్స్ తో దూసుకుపోతోంది.

Visitors Are Also Reading