అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత గతేడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయని అందువల్లే ఇద్దరూ విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపించాయి. కానీ వీరి విడాకులకు అసలు కారణం ఏంటన్నది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. అయితే అక్కినేని ఫ్యామిలీలో విడాకులు తీసుకున్నది చైతూ ఒక్కడే కాదు.
Advertisement
ఆ ఫ్యామిలీలో చాలా జంటలు విడాకులు తీసకున్నాయి. చైతూ నాన్న నాగార్జున మొదట విక్టరీవెంకటేష్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. చైతూ పుట్టిన తరవాత నాగార్జున లక్ష్మి ఏవో కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అదే విధంగా నాగర్జున మేనల్లుడు సుమంత్ కూడా తన భార్యతో విడాకులు తీసుకుని ఒంటిరి జీవితాన్ని గడుపుతున్నాడన్న సంగతి తెలిసిందే.
Advertisement
సుమంత్ కీర్తి రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ కొన్నేళ్లు కలిసున్న ఈ జంట కూడా విడాకులు తీసుకుంది. అంతే కాకుండా సుమంత్ సోదరి సుప్రియ కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. సుప్రియ హీరోయిన్ గా కూడా ఒక సినిమా చేసింది. ఆ తరవాత ఆమె సినిమాలకు దూరమైంది. కానీ నిర్మాతగా మరియు అన్నపూర్ణ స్టూడియోస్ డైరెక్టర్ గా పనిచేసింది. మరోవైపు నాగార్జున చిన్న కుమారుడు యంగ్ హీరో అఖిల్ కు ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది….పెళ్లి కూడ జరిగిపోవాల్సింది.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే అఖిల్ పెళ్లి వార్త వచ్చింది. ఓ యువతిని అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఎంగేజ్మెంట్ తరవాత ఏమైందో ఏమో గానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇలా అక్కినేని ఫ్యామిలో చాలా విడాకులు అయ్యాయి. అయితే ఇలా జరగటానికి కారణం ఆ కుటుంబానికి శాపం ఉండటమే అని కొంతమంది అంటుంటారు. ఏది ఏమైనా జీవితాంతం కలిసి ఉండాల్సిన జంటలు విడిపోవడం బాధాకరం.
ALSo ReAD :
“ఆర్ఆర్ఆర్” లో జక్కన్న మిస్ అయిన లాజిక్ ను గమనించారా..? మీకూ అదే డౌట్ వచ్చిందా..!