Home » త్వరలోనే ఆకాష్ పూరి పెళ్లి..? పెళ్లి కూతురు ఎవరంటే..?

త్వరలోనే ఆకాష్ పూరి పెళ్లి..? పెళ్లి కూతురు ఎవరంటే..?

by Anji
Ad

 టాలీవుడ్  డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. పూరిజగన్నాథ్ సినిమాల స్టైల్ వేరు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం పూరిజగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోగా రామ్ పోతినేని నటిస్తున్నాడు. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

ఇక పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి కూడా సినిమాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన ఆకాష్ పూరి జగన్నాథ్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మెహబూబా సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆకాష్ పూరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సినిమాల్లో నటించాడు. సాలిడ్ సక్సెస్ అయితే అందుకోలేకపోయారు ఆకాష్ పూరి. ప్రస్తుతం ఆకాష్ కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.

ఇదిలా ఉంటే ఆకాష్ పూరి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడని తెలుస్తోంది. ఆకాష్ తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమిస్తున్నాడని త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లితో ఒకటి కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో వీళ్ల నిశ్చితార్థం-పెళ్లి ఉండబోతున్నాయని.. దీని పై క్లారిటీ ఇవ్వనున్నారని టాక్. ఇదిలా ఉంటే ఆకాష్ చేసుకోబోయే అమ్మాయి వల్ల తాత పెద్ద రాజకీయ నాయకుడు అని తెలుస్తోంది. త్వరలోనే దీని పై పూర్తి వివరాలు వెల్లడించనున్నారని తెలుస్తోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading