టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు… ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలా విడిపోయిన జంటలలో… హీరో ధనుష్ మరియు ఐశ్వర్య దంపతులు కూడా ఉన్నారు. దాదాపు 18 సంవత్సరాలు వీరిద్దరూ తమ వివాహ బంధాన్ని కొనసాగించారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Advertisement
అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల హీరో ధనుష్ మరియు ఐశ్వర్య గత సంవత్సరంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అందరూ అభిమానులు షాక్ కు గురయ్యారు. అయితే ఆ తర్వాత వీరిద్దరు మళ్ళీ కలుస్తున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇలాంటి తరుణంలో ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.
Advertisement
కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోతో ఇటీవల కాలంలో ఐశ్వర్య చాలా చనువుగా కనిపించారట. ఐశ్వర్య నిర్మాణంలో ఆ హీరో ఓ సినిమా కూడా చేసేందుకు సిద్ధమయ్యాడట. దీంతో ఆ కోలీవుడ్ హీరోను ఐశ్వర్య పెళ్లి చేసుకోబోతుందని కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏ మేరకు నిజం ఉందో తెలియాలంటే ఐశ్వర్య స్పందించాల్సిందే.
ఇవి కూడా చదవండి
మరోసారి ఇండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ !
టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్
MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?