Home » ఏజెంట్, భోళా ఢమాల్.. అయ్యయ్యో అనిల్ సుంకర పరిస్థితి ఏందీ?

ఏజెంట్, భోళా ఢమాల్.. అయ్యయ్యో అనిల్ సుంకర పరిస్థితి ఏందీ?

by Bunty
Ad

ఈ సంవత్సరంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ‘ఏజెంట్’, ‘బోలాశంకర్’ రెండు సినిమాలు భారీ డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోలు, డైరెక్టర్లు వేరైనప్పటికీ ప్రొడ్యూసర్ మాత్రం ఒక్కడే. ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. ఏజెంట్ సినిమా ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా తెరకెక్కించడంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది అనుకుంటే భోలా శంకర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ రెండు సంవత్సరాలు జరిగింది.

Advertisement

అయినా కూడా ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఏజెంట్ సినిమాకి బడ్జెట్ దాదాపు 70 కోట్లు. కానీ రిలీజ్ అయిన తర్వాత వచ్చింది మాత్రం 12 నుంచి 13 కోట్లు. ఈ సినిమాపై ఎలాంటి గొడవలు జరిగాయో తెలియదు కానీ ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఇక బోలా శంకర్ సినిమాకి బడ్జెట్ 101 కోట్లు.

Advertisement

మొదటి రోజు 20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకు వచ్చిన టాక్ కి కనీసం 50 కోట్లు రావడం కూడా చాలా కష్టంగా మారింది. చిరంజీవికి కూడా ఈ సినిమా డిజాస్టర్ గా మారుతుందని నేషనల్ మీడియా చానల్లో కూడా రాసుకొచ్చారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు కాలేదు. ఈ సినిమాకి ఇంత దారుణమైన టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా రైట్స్ ని కొనడానికి బేరాలు ఆడతారు. ఇక ప్రొడ్యూసర్ కి భారీ నష్టం వాటిల్లింది.

ఇవి కూడా చదవండి 

హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?

Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్‌ ఆడుకో !

క్రికెటర్ గిల్ తో హీరోయిన్ రష్మిక ప్రేమాయణం ?

Visitors Are Also Reading