సినీ ఇండస్ట్రీలో అనేక గాసిప్స్ వస్తుంటాయి, పోతుంటాయి. హీరో, హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే కనిపించే ప్రతి ఒక్కరిని వదలకుండా నెటిజన్లు ఎప్పుడు ఏదో ఒక గాసిప్ వైరల్ గా మార్చేస్తుంటారు. గాసిప్స్ పుణ్యమా అని నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్దమో తెలియని విధంగా పరిస్థితి మారిపోయింది.
also read:ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..?
Advertisement
అలా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్ లు అమితాబ్ బచ్చన్ పైనే ఎక్కువగా వచ్చాయని చెప్పొచ్చు. ఒకానొక సందర్భంలో అమితాబచ్చన్ కూడా ఇలాంటి రూమర్ల బారిన పడ్డారు. అయితే తాజాగా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబచ్చన్ మనవడు అగస్త్య నంద డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ నైట్ పార్టీలో అగస్త్య, సుహానాలకు సంబంధించిన రొమాంటిక్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
Advertisement
దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు ఈ స్టార్ కిడ్స్ ఇద్దరూ ‘ఆర్చీస్’ మూవీ ద్వారా అరంగేట్రం చేయనుండగా, ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఒకరినొకరు తరచుగా కలుసుకోవడం, పార్టీలు ముగించుకుని వెళ్తున్నప్పుడు హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడం ఈ పుకార్లకు ఆజ్యం పోసింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ తానీయ శ్రాఫ్ పుట్టినరోజు వేడుకకు హాజరవగా, సుహానాను దగ్గరుండి కారు ఎక్కించిన అగస్త్య ఆమెకు ఫ్లయింగ్ కి*** ఇవ్వడం చర్చనీయాంశమైంది.
read also : TS Constable : ఏప్రిల్ 2న పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి