Home » చంద్రగ్రహణం పూర్తయ్యాక.. ఈ రాశుల వారికి అదృష్టం.. ధన లాభం!

చంద్రగ్రహణం పూర్తయ్యాక.. ఈ రాశుల వారికి అదృష్టం.. ధన లాభం!

by Anji
Ad

ఇటీవలే దీపావళి పండుగ సమయంలో అక్టోబర్ 25న సూర్యగ్రహణం వచ్చిన విషయం విధితమే. ఇక ఆ తరువాత ఇప్పుడు కేవలం 15 రోజుల వ్యవధిలోనే చంద్రగ్రహణం కూడా వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 08 న సంపూర్ణ చంద్ర గ్రహణం భారత కాలమాన ప్రకారం.. మధ్యాహ్నం 2 :39 గంటలకు ప్రారంభమై దాదాపు 4 గంటల పాటు ఈ గ్రహణం ఉండనుంది. 6 :19 గంటల వరకు కొనసాగుతుంది. నేపాల్, భారత్, జపాన్ దేశాలతో సహా ప్రపంచంలోని పలు దేశాలపై ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం ఉండనుంది. ఈ సారి చంద్రగ్రహణం మేషరాశిలో సంభవించనుంది. చంద్ర గ్రహణం ఈ నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వనుందని వేద పండితుతులు పేర్కొంటున్నారు. చంద్ర గ్రహణం వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


జ్యోతిష్యుల ప్రకారం.. అక్టోబర్ 25న సూర్యగ్రహణం సంభవించింది. నవంబర్ 08న చంద్రగ్రహణం వచ్చింది. కేవలం 15 రోజుల గ్యాప్ లోనే రెండు గ్రహణాలు సంభవిస్తున్నాయి. జ్యోతిష్కుల ప్రకారం.. ఒకవైపు లేదా 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు రావడం అనేది ప్రధాన అశుభ సంకేతాలుగా పరిగణిస్తారు. పురాణాలను పరిశీలిస్తే మహాభారత కాలంలో కూడా ఒకే దశలో రెండు గ్రహణాలు వచ్చాయని చెబుతారు. ఆ తరువాత కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చంద్రగ్రహణ సమయంలో కూడా  4 రాశుల వారు సంతోషంగా ఉంటారని చెబుతున్నారు జ్యోతిష్యులు. మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభ రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయని పండితులు పేర్కొంటున్నారు. 

Advertisement

Also Read :  ఈ 5ల‌క్ష‌ణాలు ఉన్న పురుషుల‌ను స్త్రీలు ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తార‌ట‌..! 3వది చాలా ముఖ్య‌మైన‌ది..!

మిథున రాశి :

Advertisement

చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మిథున రాశి ఒకటి. ఈ రాశి వారికి చంద్రగ్రహణం కలిసి వస్తుంది. ఆర్థికంగా సంక్షోభాన్ని అధిగమిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. చదువుకునే వారికి కూడా చాలా మంచిది అని పండితులు పేర్కొంటున్నారు. 

కర్కాటక రాశి :

చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మరో రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయం నుంచి వారి పనిలో శుభ ఫలితాలుంటాయి. వ్యాపారం, ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అప్పుడే వృత్తి పరమైన మెరుగుదల ఉంటుంది. 

కుంభ రాశి :

చంద్రగ్రహణం రోజు శుభ ఫలితాలు పొందే రాశుల్లో మూడవ రాశి కుంభ రాశి. ఈ రాశి గల వారికి ధనం సమకూరుతుంది. వారు తమ కుటుంబ వనరుల నుంచి డబ్బు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పని ఒత్తిడి తగ్గుతుంది. 

Also Read :  NTR సలహాని పట్టించుకోని రేలంగి.. పాటించి ఉంటే మాత్రం ఈరోజు మరోలా ఉండేది..!!

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి వారికి కూడా చంద్రగ్రహణం సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మంచి ఫలితాలుంటాయి. అయితే ఖర్చులు పెరిగే అవకాశమంది. ఈ సమయంలో తెలివిగా ఖర్చు చేస్తే చాలా బెటర్. 

Also Read :  మధ్యాహ్నం భోజనం తరువాత మీకు నిద్ర వస్తుందా ? అయితే ఇలా చేయండి..!

Visitors Are Also Reading