Home » 37 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ పుస్త‌కాలు చేత‌బ‌ట్టి.. ఆ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త

37 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ పుస్త‌కాలు చేత‌బ‌ట్టి.. ఆ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త

by Anji
Published: Last Updated on
Ad

మ‌హారాష్ట్రలో కుటుంబం కోసం త‌న చ‌దువును త్యాగం చేసిన ఓ మ‌హిళ యొక్క జీవితం ఇప్పుడు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచింది. ఆమె చ‌దువుకు స్వ‌స్తీ చెప్పిన 37 సంవ‌త్స‌రాల తరువాత ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసి ఉత్తీర్ణ‌త సాధించింది. ల‌క్ష‌లాది మంది స్ఫూర్తిదాయ‌కంగా నిలిచారు. రాత్రి వేళ‌లో చ‌దువుకున్న వారికి ప‌ద‌వ‌త‌ర‌గ‌తి పూర్తి చేయ‌డానికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిందంట.

Advertisement

ఇక ఈ విష‌యాన్ని తెలుసుకున్న క‌ల్ప‌నా జంభ‌లే త‌న చ‌దువును కొన‌సాగించాల‌నుకుంది. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసి పాస్ అయింది. స్వ‌యంగా కుమారుడు ప్ర‌సాద్ జంభ‌లే (16) నే లింక్ డిడ్ ద్వారా అంద‌రికీ తెలిపారు. ఐర్లాండ్‌లో ఉన్న‌ప్పుడు రాత్రి స‌మ‌యంలో కాల్ చేసేవాడిని. అమ్మ ఎక్క‌డ అని అడిగే వాడిని.. వాకింగ్ వెళ్తున్నాన‌ని చెప్పేది. ఆమె వాకింగ్పై ఆస‌క్తి చూపించ‌డం వింత‌గా ఉంద‌నిపిస్తుంది.రాత్రిపూట బ‌డికి వెళ్లి పాఠ‌శాల‌లు నేర్చుకుంద‌ని.. ఆ త‌రువాత త‌న‌కు తెలిసిందని ప్ర‌సాద్ చెప్పాడు.

Advertisement

త‌న త‌న వివాహం ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగింద‌ని.. పద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మార్చిలో జ‌రిగ‌గా ఈ రెండింటిని త‌న త‌ల్లి క‌ల్ప‌న జంభ‌లే చాలా సుల‌భంగా చేసింద‌ని చెప్పాడు. క‌ల్ప‌న ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించ‌డ‌మే కాకుండా 79.6 శాతం స్కోర్‌ను సాధించింది. ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లి గురించి ఆలోచిస్తే చాలా గ‌ర్వంగా ఉంద‌ని ప్ర‌సాద్ వెల్ల‌డించాడు. 53 ఏళ్ల వ‌య‌సులో త‌న త‌ల్లి నేర్చుకోవ‌డం ఆప‌లేద‌ని, చ‌దువు ప‌ట్ల త‌న‌కు ఉన్న ఆస‌క్తితో ఎంతో ప‌ట్టుద‌ల‌గా ప‌ద‌వ‌త‌ర‌గ‌తిని పూర్తి చేసింద‌ని సంతోషం వ్య‌క్తం చేశాడు.

Also Read : 

మీరు 10 సెక‌న్లు ఒంటికాలు మీద నిల‌బడ‌లేరా..? అయితే ఈ జాగ్ర‌త్త ప‌డండి

 

Visitors Are Also Reading