కామన్ వెల్త్ గేమ్స్‌లో దాదాపు 24 ఏళ్ల తరువాత క్రికెట్‌కు చోటు దక్కింది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉన్నది. మరల ఇప్పుడు ఇంగ్లండ్లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు అధికారులు చోటు కల్పించారు. జులై 28 నుండి ఆగస్టు 08వరకు కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. అయితే ఈసారి క్రికెట్‌లో మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. టీ-20 ఫార్మాట్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు.
Advertisement
Advertisement
కామన్‌వెల్త్ గేమ్స్ లో మహిళలు తొలిసారి క్రికెట్ ఆడబోతున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా, భారత్, బార్బడోస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఈ టోరనీకి అర్హత సాధించినట్టు ఐసీసీ వెల్లడించింది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థులు అయినటువంటి భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండడం విశేషం. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు ఉండగా.. గ్రూప్ బీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ టీమ్‌లున్నాయి. మహిళల టీ-20 జట్టు ప్రపంచకప్ ఫైనలిస్ట్‌లు ఆస్ట్రేలియా, భారత్ జట్లు జులై 29న తలపడే మ్యాచ్‌తో కామన్వెల్త్ క్రీడలలో క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
Also Read : సర్కారు వారి పాట సినిమాకు సెంటిమెంట్.. అందుకోసమేనా..?