Home » ఆదికేశవ, కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఆదికేశవ, కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

by Anji
Ad

ఆదికేశవ, కోట బొమ్మాలి పిఎస్ రెండు సినిమాలు ఈ ఫ్రైడే థియేటర్లలో సందడి చేశాయి. నవంబర్ 24న వచ్చిన ఈ రెండు సినిమాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక అప్పుడే నేటిజన్లలో ఈ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతాయి? ఎప్పుడు స్ట్రీమ్ అవుతాయి? అనే చర్చ మొదలైంది. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ఆదికేశవ సినిమాకు ప్రేక్షకుల నుంచి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీకి ముందు నుంచే పెద్దగా బజ్ లేదు.


మేకర్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. ఇక ఈ మూవీని చూస్తుంటే ఇప్పటికే టాలీవుడ్ లో వచ్చిన కొంతమంది స్టార్ హీరోల సినిమాలలో ఉన్న కొన్ని సీన్లు గుర్తొస్తాయని అంటున్నారు. పైగా ఈ మూవీ కంటే రీసెంట్ గా వచ్చిన స్కంద బెటర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి వైష్ణవ్ తేజ్ కు ఈ మూవీ మరో డిజాస్టర్ గా మిగిలింది. ఇక కోట బొమ్మాలి పిఎస్ విషయానికి వస్తే.. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ నాయట్టు మూవీకి రీమేక్ గా వచ్చింది. ఆదికేశవ మూవీ కంటే ఈ మూవీనే ఎంతో కొంత బెటర్ అని టాక్ నడుస్తోంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒకసారి మాత్రం చూడొచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement


ఏదేమైనా ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ కు నిరాశ తప్పలేదు. సినీ ప్రియులు కూడా డిసెంబర్ దాకా థియేటర్ల వైపు చూడడానికి ఇష్టపడడం లేదు. ఇక థియేటర్ రిలీజ్ కు ముందే ఈ రెండు సినిమాల డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ఆదికేశవ మూవీని కాస్ట్లీ ఓటీటీ నెట్ ఫిక్స్ సొంతం చేసుకోగా, కోట బొమ్మాలి మూవీని గీత ఆర్ట్స్ వారే నిర్మించారు. అలాగే మూవీ కూడా వారికి సంబంధించిన రీజనల్ ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు సినిమాలు కూడా డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కానున్నాయని సమాచారం. ఆదికేశవ కోట బొమ్మలి పిఎస్ సినిమాలకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Visitors Are Also Reading