తెలుగు బుల్లితెర చరిత్రలో సుదీర్ఘకాలంగా ప్రసారమవుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ఏళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తున్న ఈ కార్యక్రమం అప్పటికి ఇప్పటికి ఒకే రకమైన రెస్పాన్స్ ను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్ ను సైతం రాబడుతోంది. ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో వచ్చినప్పటికీ అవన్నీ దీని ప్రభావానికి తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఇటీవల కాలంలో అందరూ జబర్దస్త్ నీ వీడి వెళ్లిపోవడంతో మెల్లగా జబర్దస్త్ ప్రభావం తగ్గుతూ వచ్చింది.
Advertisement
మొదట ఈ షో నుండి నాగబాబు తప్పకున్నాడు. జడ్జీలుగా రోజా మరియు నాగబాబు వెళ్లిపోవడం ఎలాంటి ప్రభావం చూపలేదు కానీ సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను ఇలా ఒకరి వెంట ఒకరు వెళ్లిపోవడంతో ఈ షో రేటింగ్ అమాంతం తగ్గిపోయింది. మంచి మంచి కాంబినేషన్ తో కూడిన టీం లీడర్స్ వెళ్లిపోవడం జరిగింది. ఎవరు వెళ్లిపోయినప్పటికీ షో నడవాలి కాబట్టి కొత్త వాళ్ళతో ఈ షోను నడుపుతున్నారు కానీ కొత్త వారి వల్ల ఈ షో ప్రభావం అంతగా పెరగలేదు. ఇక లేటెస్ట్ గా అదిరే అభి కూడా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చాడు. ఈ తరుణంలో తాజాగా అతను ట్విట్టర్ లో ఒక లేఖ పెట్టారు.
జబర్దస్త్ కు దిష్టి తగిలింది అంటూ అతను పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. జబర్దస్త్ కుటుంబంలో కలిసి మెలిసి ఉండే అందరం ఇప్పుడు ఎవరికి వారుగా విడిపోయాం. ఎవరైనా అంటే క్షమించని మేము ఇప్పుడు మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం. అంటూ జబర్దస్త్ లో తాము గడిపిన రోజులని గుర్తు చేసుకుంటూ ఎవరో దిష్టి పెట్టారంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అదిరే అభి పోస్ట్ పెట్టినట్లే ఇప్పుడు జబర్దస్త్ లో ఎక్కడ యూనిటీ కనిపించడం లేదు. ఎవరికీ వారే అన్నట్టుగా అందరూ ఉన్నారనే మాట వినిపిస్తుంది.
READ ALSO : బాలయ్య కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువగా ఉండడానికి అసలు కారణాలివే!