చాలామందికి ఆహారం తీసుకున్న తర్వాత సోంపు తినే అలవాటు అనేది ఉంటుంది. బాగా తిన్నాక కాస్త సోంపును తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని చాలామంది భావిస్తారు. పిన్నెల్ సీడ్స్ అని పిలిచే జింక్, కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్, విటమిన్ బి,విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యపరంగా సోంప్ అనేది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Advertisement
also read:శబరిమలలో పరశురాముడు నిర్మించిన మెట్లు పంచలోహ మెట్లుగా ఎలా మారాయో తెలుసా ?
సోంపు డైరెక్టుగా కాకుండా కాస్త గోరువెచ్చని పాలలో పావు టేబుల్ స్పూన్ సోంపు పొడి, రుచికి సరిపడా బెల్లం పొడి, కలిపి రాత్రి నిద్రపోయే ఒక గంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తే మీకు నిద్రలేమి, అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. రక్తహీనత సమస్యలు కూడా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఈ విధంగా చేయడంవల్ల శరీరానికి తగిన ఐరన్ లభించి రక్తహీనత సమస్య దూరం అవుతుంది.
Advertisement
సోంపులో ఉండే పాలిపెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు, మధుమేహం, గుండె జబ్బులు వంటివి దరిచేరకుండా చేస్తాయి. గోరువెచ్చని పాలలో సోంపును ఆడ్ చేసి నైట్ నిద్రిస్తే ఎముకలు గట్టిగా తయారవుతాయి. నోటిపూత వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పాలలో సోంపు పొడి కలుపుకొని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇది తప్పకుండా ట్రై చేయండి.
also read: