Home » బీసీసీఐ మాదిరే అన్ని బోర్డులకు లాభాలు రావాలి..!

బీసీసీఐ మాదిరే అన్ని బోర్డులకు లాభాలు రావాలి..!

by Azhar
Ad
ప్రపంచ క్రికెట్ లో మన ఐపీఎల్ అనేది ఒక్క సునామి సృష్టించింది అనే విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ వల్లే టీ20 క్రికెట్ యొక్క క్రేజ్ పైగా బాగా పెరిగింది. అలాగే 2008 లో ప్రారంభమైన ఈ లీగ్ వల్ల మన బీసీసీఐకి చాలా లాభాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మన బోర్డుకు వస్తున్న లాభాలను చూసి.. మిగితా దేశాల బోర్డులు కూడా తమకంటూ ప్రత్యేక క్రికెట్ లీగ్స్ ను ప్రారంభించాయి. కానీ అందులో ఏది కూడా మన ఐపీఎల్ కు సాటి లేదు. అలాగే మన బీసీసీఐకి వచ్చిన లాభాలలో కనీసం సగం కూడా ఆ దేశాలకు రావడం లేదు.
అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పందించాడు. బీసీసీఐకి వచ్చిన విధంగానే మిగిలిన దేశాలకు కూడా లాభాలు అనేవి రావాలంటే ఇండియా ఆటగాళ్లు వచ్చి ఆ లీగ్స్ లో ఆడాలని అని పేర్కొన్నాడు. అయితే మన బీసీసీఐ పెట్టిన నియమం ప్రకారం.. విదేశీ లీగ్స్ లో మన ఇండియా ఆటగాళ్లు ఎవరు ఆడకూడదు. ఒకవేళ అందులో పాల్గొంటే ఇక్కడ మన ,ఇండియా జట్టుకు గాని… ఐపీఎల్ లో, దేశీయ క్రికెట్స్ లో ఆడే అవకాశం ఉండదు. అందుకే ఇక్కడ మొత్తం క్రికెట్ కు వీడ్కోలు అనేది ఇచ్చిన తర్వాతే ఆటగాళ్లు విదేశీ లీగ్స్ లో ఆడుతారు.
ఈ విషయంపై ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ… బీసీసీఐ తమ ఆటగాళ్లను విదేశీ లీగ్స్ లో ఆడిస్తే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ఐపీఎల్ కు ఏ నష్టం ఉండదు. అలాగే ఇండియా ఆటగాళ్లను విదేశీ పిచ్చులపైన అనుభవం అనేది పెరుగుతుంది. కానీ బీసీసీఐ వారిని ఎందుకు ఆదుకుంటుందో తెలియదు. ఐపీఎల్ వల్ల బీసీసీఐ చాలానే లాభం పొందింది. ఇప్పుడు వేరే దేశాల లీగ్స్ కూడా అలానే లాభాలు ఆర్జించాలి అంటే.. బీసీసీఐ తమ ఆటగాళ్లను విదేశీ లీగ్స్ లో ఆడేందుకు అనుమతించాలి అని ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు.

Advertisement

Visitors Are Also Reading