Home » మంచి పాత్ర‌ల‌ను రిజెక్ట్ చేసి న‌ష్ట‌పోయిన 10 మంది న‌టీమ‌ణులు వీళ్లే..ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

మంచి పాత్ర‌ల‌ను రిజెక్ట్ చేసి న‌ష్ట‌పోయిన 10 మంది న‌టీమ‌ణులు వీళ్లే..ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

by AJAY
Ad

సినిమాల‌లో మంచి పాత్ర‌లు రావ‌డం అంత ఈజీ కాదు. ఒకవేళ వెతుక్కుంటూ ఆఫ‌ర్ లు వ‌చ్చినా కూడా మిస్ చేసుకున్నారంటే వాళ్లను బ్యాడ్ లక్ వెంటాడినట్టే. అలాంటి నటీనటులు గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నట్టే. అలా టాలీవుడ్ లో కొంతమంది మంచి పాత్రలను మిస్ చేసుకున్న నటీనటులు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం…..!


Also Read: సీనియర్ నటి భానుప్రియ కూతురు ఎంత అందంగా ఉందంటే..?

Advertisement

రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త‌ పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత అనసూయ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే ఈ సినిమా కోసం ముందుగా హీరోయిన్ రాశిని సంప్రదించారు అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ రాశి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.

Also Read:  సినిమాలు వ‌ద్దు బాబోయ్ అని అమెరికా వెళ్లిపోయిన వెంక‌టేష్..మ‌ళ్లీ ఎవ‌రివ‌ల్ల తిరిగి వ‌చ్చారంటే..?

 

అదేవిధంగా బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవిని సంప్రదించారు. కానీ శ్రీదేవి కొన్ని కండిషన్లు పెట్టడంతో ఆ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారు. అంతేకాకుండా నిజం సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించే పాత్ర కోసం మొదట హీరోయిన్ జయసుధను అనుకున్నారు.

Advertisement

కానీ జయసుధ బిజీగా ఉండడంతో ముందు ఓకే చెప్పి ఆ తర్వాత కాల్ షీట్లు సర్దుబాటు కాకపోవడంతో సినిమా నుండి తప్పుకున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం మొదట హీరోయిన్ లయను సంప్రదించారు. కానీ హీరోకి చెల్లెలుగా తాను నటించాన‌ని ల‌య రిజెక్ట్ చేశారట. అంతేకాకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ను సంప్రదించారు. కానీ విద్యాబాలన్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు.

అంతేకాకుండా రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజకు తల్లిగా రాధిక అద్భుతమైన న‌ట‌న‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం మొదట హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ విజయశాంతి రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రను మిస్ చేసుకున్నారు.

 

మరోవైపు నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర కోసం మొదట హీరోయిన్ మీనా ను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల చివరికి ఆ స్థానంలో రమ్యకృష్ణ తీసుకున్నారు. నిజం సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్ర కోసం హీరోయిన్ రేఖను కూడా సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో ప్రిన్స్ కు తల్లిగా నటించేందుకు హీరోయిన్ జయప్రదను సంప్రదించారు. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆఫర్ జయసుధ వద్దకు వెళ్ళింది.

Also Read:  సీనియర్ నటి భానుప్రియ కూతురు ఎంత అందంగా ఉందంటే..?

Visitors Are Also Reading