Home » స‌మంత లానే అరుధైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న వంటల‌క్క‌..షాక్ లో ఫ్యాన్స్..!

స‌మంత లానే అరుధైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న వంటల‌క్క‌..షాక్ లో ఫ్యాన్స్..!

by AJAY
Ad

స్క్రీన్ పై హుషారుగా క‌నిపించే న‌టీన‌టులు నిజ‌జీవితంలో వ్యాధుల బారిన ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ లుగా రానిస్తున్న‌వాళ్లు హీరోలు మరియు ఇత‌ర నటీన‌టులు త‌మ‌కు ఉన్న వ్యాధుల‌ను ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

premi vishwanath

premi vishwanath

కాగా స‌మంత మాత్ర‌మే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య, ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రేణూదేశాయ్ సైతం తాను గుండె మ‌రియు ఇత‌ర ఆరోగ్యస‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్నాన‌ని వెల్ల‌డించింది. ఇదిలా ఉంటే తాజాగా కార్తీక‌దీపం వంట‌లక్క కూడా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

Advertisement

premi vishwanath

premi vishwanath

వంట‌ల‌క్క అస‌లు పేరు ప్రేమివిశ్వ‌నాథ్…కాగా కార్తీక‌దీపం సినిమాతో ఓ రేంజ్ లో అభిమానుల‌ను సంపాదించుకుంది. 2017 లో ప్రారంభం అయిన ఈ సీరియ‌ల్ కు విశేష ఆద‌ర‌ణ వ‌చ్చింది. 2023 వ‌ర‌కూ ఈ సీరియ‌ల్ ను సాగదీశారు. ఇక ఈ సీరియ‌ల్ స‌క్సెస్ లో ప్రేమి విశ్వ‌నాథ్ కూడా కీల‌కం అనే చెప్పాలి. ఈ సీరియ‌ల్ కు వంట‌ల‌క్క పాత్ర‌నే హైలెట్ గా నిలిచింది.

అంతే కాకుండా ఈ సీరియ‌ల్ పై వంట‌ల‌క్క పై సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ మీమ్స్ క‌నిపిస్తుంటాయి. కాగా ప్రేమివిశ్వ‌నాథ్ కార్తీక‌దీపం సీరియ‌ల్ కోసం మేక‌ప్ ఎక్కువ‌గా వాడ‌టంతో చ‌ర్మ‌సంబంధిత అనారోగ్యానికి గుర‌య్యిందంటూ టాక్ వినిపిస్తోంది. చ‌ర్మం పై మ‌చ్చ‌లు రావ‌డంతో దాని కోసం ఆమె చికిత్స తీసుకుంటోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక వంట‌ల‌క్క అనారోగ్యంబారిన ప‌డిన‌ట్టు వార్తలు రావ‌డంతో ఆమె అభిమానులు షాక్ లో ఉన్నారు.

ALSO READ : అతడు సినిమాలో ఆ సీన్లు.. త్రివిక్రమ్ కాపీ కొట్టారని మీకు తెలుసా?

Visitors Are Also Reading