సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు పూర్ణ. మొదట్లో వరుస అవకాశాలను అందుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ, తర్వాత సినిమాలలో ఆఫర్లు తగ్గినప్పుడు బుల్లితెరపై టీవీ షోలు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.
Advertisement
ముందుగా తెలుగు తెరకు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సీమటపాకాయ్ సినిమా ద్వారా బాగా పాపులారిటీ అయిన పూర్ణ ఆ తర్వాత అవును సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం దుబాయ్ బిజినెస్మెన్ శానిద్ ఆసిఫ్ ఆలీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సమక్షంలో అరబిక్ పద్ధతిలో ఈమె వివాహం గ్రాండ్ గా జరిగింది.
Advertisement
ఇది ఇలా ఉంటే, పూర్ణ తల్లిని కాబోతున్నాను అని ప్రకటించింది. తన పేరెంట్స్, బంధువులతో తాను తల్లిని కాబోతున్న విషయాన్ని పంచుకొని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న సన్నివేశాన్ని వీడియో రూపంలో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. పూర్ణ తల్లి కాబోతోంది అని ప్రకటించడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమె శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే బేబీబంప్ తో ఉన్న ఫోటోలను పూర్ణ షేర్ చేయడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
READ ALSO : చిరంజీవి పై కోపంతో సినిమా సెట్ బయటే నిలబెట్టి మరి తిట్టేసిన స్టార్ ప్రొడ్యూసర్ అతడేనా ?