టాలీవుడ్ జంట సమంత నాగ చైతన్యలు గతేడాది అక్టోబర్ లో విడాకులు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నెలలు గడిచిపోతున్నా ఈ వార్త ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. ఏదో ఒక విధంగా విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ధనుష్ ఐశ్వర్యలు కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి విడాకుల నేపథ్యంలో మరోసారి చైతన్య సమంత విడాకులు తెరపైకి వచ్చాయి.
ధనుష్ ఐశ్వర్య విడాకులను వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో మళ్ళీ ఇద్దరూ కలవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ నటి లక్ష్మీ రామకృష్ణన్ ను ట్యాగ్ చేస్తూ అమ్మా లక్ష్మీ రామకృష్ణన్…. ధనుష్ ఐశ్వర్యలను మీరు ఎలాగైనా కలపాలి. అని అని కోరారు. దానికి సమాధానం ఇచ్చిన లక్ష్మీ రామకృష్ణన్ వారిద్దరూ పరస్పరం గౌరవభావంతో విడిపోయారని ఒకరినొకరు నిందించకుండా చట్ట బద్ధంగా విడాకులు తీసుకున్నారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
దయచేసి వారికి ప్రైవసీని కల్పించాలని కోరారు. దాంతో ఆ నెటిజన్ మళ్లీ స్పందిస్తూ వారి నిర్ణయాన్ని నేను కూడా గౌరవిస్తాను. కానీ వారిద్దరూ సైలెంట్ గా విడాకులు తీసుకుని ఉంటే బాగుండేది ఇలా ప్రచారం చేసుకోకూడదు. ఒకప్పుడు విడాకులు అంటే మామూలు విషయం కాదు. కానీ సెలబ్రిటీల వల్ల విడాకులు సాధారణ విషయంగా మారిపోయాయి. అంటూ పేర్కొన్నాడు. అయితే దీనికి సమాధానం ఇస్తూ నటి లక్ష్మీ రామకృష్ణన్ అలా చేయకుంటే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి.
వారి గురించి అనేక వార్తలు చక్కర్లు కొడతాయి. ఇటీవల విడాకులు తీసుకున్న సమంత నాగచైతన్య ల జంటను ఉదాహరణ తీసుకోండి. తాము గౌరవప్రదంగా విడిపోతున్నాం అని ప్రకటించినప్పటికీ సమంత దారుణమైన విషయాలను భరించాల్సి వచ్చింది. అంటూ నటి పేర్కొంది. ఇదిలా ఉండగా విడాకుల అనంతరం సమంత పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సమంత ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో నటించడం వల్ల కలహాలు వచ్చాయని….తన మేకప్ సంబంధం ఉందంటూ పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.
also read : విడాకులు క్యాన్సిల్ చేసుకుంటున్న చై-సామ్..ప్రూఫ్ ఇదే…!