Home » విడాకులు క్యాన్సిల్ చేసుకుంటున్న చై-సామ్..ప్రూఫ్ ఇదే…!

విడాకులు క్యాన్సిల్ చేసుకుంటున్న చై-సామ్..ప్రూఫ్ ఇదే…!

by AJAY
Ad

గతేడాది అక్టోబ‌ర్ లో సమంత నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. విడాకులకు గ‌ల కార‌ణాల‌ను ఈ జంట వెల్ల‌డించ‌లేదు కానీ నాలుగేళ్ల వివాహ‌బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్టు ప్ర‌క‌టిస్తూ స‌మంత నాగ‌చైత‌న్య ఓ విడాకుల స్టేట్ మెంట్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అయితే వీరద్ద‌రి విడాకుల‌కు కార‌ణం సమంత ఫ్యామిలీకి ఇష్టం లేని వెబ్ సిరీస్ లు చేయ‌డ‌మేన‌ని ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి.

Advertisement

అంతే కాకుండా స‌మంత పిల్ల‌ల‌ను క‌నేందుకు కూడా నిరాక‌రించిందంటూ వార్త‌లు వినిపించాయి. మ‌రోవైపు నాగ‌చైత‌న్య‌నే మ‌రో హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నారంటూ వార్త‌లు వినిపించాయి. అయితే అస‌లు కార‌ణం తెలియ‌దు కానీ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోయారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇక వీరిద్ద‌రి విడాకుల వార్త మాత్రం అభిమానులను ఎంతో బాధించింది.

Advertisement

samantha nagachaithanya

ఇక విడాకుల త‌ర‌వాత సమంత నాగ‌చైత‌న్య వ‌రుస సినిమాల‌తో బిజీ అయ్యారు. స‌మంత ఇటీవ‌ల పుష్ప సినిమాలో ఐటం సాంగ్ కు స్టెప్పులు వేసి ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా మ‌రికొన్ని సినిమాల్లో న‌టించేందుకు రెడీ అవుతోంది. ఇక నాగ‌చైత‌న్య ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించారు. అంతే కాకుండా రీసెంట్ సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఇదిలా ఉంటే స‌మంత నాగ‌చైత‌న్య తమ విడాకుల‌ను క్యాన్సిల్ చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు గుస‌స‌లు వినిపిస్తున్నాయి. ఆ వార్త‌ల‌కు ఓ కార‌ణం కూడా ఉంది. స‌మంత విడాకుల ప్ర‌క‌ట‌నను సోష‌ల్ మీడియా నుండి డిలీట్ చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లిసే ఆలోచ‌న‌లో ఉన్న‌రంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే చైతూ మాత్రం విడాకుల ప్ర‌క‌ట‌నను డిలీట్ చేయ‌లేదు. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Visitors Are Also Reading