హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాంబేలో పుట్టి పెరిగిన జ్యోతిక హీరోయిన్ గా సౌత్ తో పాటు నార్త్ లో కూడా తనదైన ముద్ర వేసుకొని సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సూర్యతో ప్రేమాయణం కొనసాగించి, అతనితో జీవితాన్ని పంచుకొని ఇద్దరు పిల్లలు తల్లిగా తన జీవితాన్ని ఎంతో అందంగా, ఆనందంగా కొనసాగిస్తుంది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా తనలోని టాలెంట్ కి సూర్య అడ్డుకట్ట వెయ్యలేదు. ఆమెను నటించమని చక్కగా ఎంకరేజ్ చేశాడు. అందుకే ప్రస్తుతం ఆమె మెయిన్ లీడ్ గా అనేక సినిమాలు నటిస్తూ నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది.ఒక వైపు ఇద్దరు పిల్లలకు తల్లిగా, మరోవైపు నటిగా, నిర్మాతగా ఆమె తన అడుగులను చాలా జాగ్రత్తగా వేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుంది.
Advertisement
అంతేకాదు హీరో సూర్య జీవితంలో అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉన్న జ్యోతిక తన భర్త కెరియర్ కూడా చక్కగా ముందుకు వెళ్లడానికి తనదైన సహాయం అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నా జ్యోతిక ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లో తన అందానికి గల రహస్యం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా ఆమె నవ్వుతూ నా జీవితమంతా ఎంతో సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉన్నాను. అందుకే నేను ఇంత అందంగా ఉండగలిగాను అంటూ సమాధానం చెప్పి అందరినీ నవ్వించింది. ఆమె చెప్పిన సమాధానానికి స్టేజ్ కింద ఉన్న వారంతా చప్పట్లతో ఓ తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. సూర్య తన భార్యకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.
Advertisement
చాలా మంది హీరోలు లాగా భార్యను వంటింటికే పరిమితం చేయకుండా ఆమెకు నచ్చిన పని చేసే విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. తను స్టార్ అయినప్పటికీ తన పిల్లలకు తల్లిగా ఉంటే చాలు అని సూర్య ఏ రోజు అనుకోలేదు. అందుకే ఆమె తన భర్త ఇచ్చిన ప్రేమకు ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. అందువల్లే ఆమె తన బ్యూటీని అలాగే కొనసాగించగలుగుతుంది. జ్యోతిక లాంటి ఒక అదృష్టవంతురాలు మరెవ్వరూ ఉండరు. మొదట్లో ఎవరికి జ్యోతిక అంటే ఇంట్లో ఇష్టం ఉండేది కాదట. కానీ ఆమె తన సత్ప్రవర్తనతో అందరి మనసులను గెలుచుకొని ప్రస్తుతం ఇంటికి ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చే కోడలిగా ఇల్లు చక్కబెడుతూనే సినిమాలను చేస్తుంది.
మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!