Home » తెలుగు సినిమాల పై నటుడు రవి కిషన్ షాకింగ్ కామెంట్స్..!

తెలుగు సినిమాల పై నటుడు రవి కిషన్ షాకింగ్ కామెంట్స్..!

by Anji
Ad

తెలుగు సినీ పరిశ్రమలో విలన్‏గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవికిషన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి రాకముందు భోజ్ పురి, హిందీ చిత్రాల్లో నటించాడు. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు రవికిషన్. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఆయన.. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. భోజ్ పురి అనగానే చాలా మందికి అలాంటి చిత్రాలే గుర్తొస్తాయని.. అక్కడ సరైన సినిమాలే ఉండవని భావిస్తుంటారు. ఈ పరిస్థితులు చాలా వరకు మారాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే తాను భోజ్ పురి ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించానని తెలిపారు.

Advertisement

“మహాదేవ్ కా గోరఖ్ పూర్ సినిమాతో నేను భోజ్ పురి ఇండస్ట్రీని మార్చడానికి ప్రయత్నించాను. భోజ్ పురి సినిమా మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్న వ్యక్తిని నేను. అక్కడ వచ్చే పాటలు, ప్రైవేట్ సాంగ్స్ ఇండస్ట్రీ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను రాజకీయంలోకి రావడం వల్ల అంతగా పట్టించుకోలేదు. కానీ నేనిప్పుడు భోజ్ పురి ఇండస్ట్రీని మార్చాలనుకుంటున్నాను. మహాదేవ్ కా గోరఖ్ పూర్ సినిమా చేశాను. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం ప్రజల ఆలోచనలను మారుస్తుందని.. అక్కడున్న జూనియర్ నటీనటులందరూ కొత్తగా సినిమాలను తెరకెక్కిస్తారని భావిస్తున్నారు. అలాంటి పాటలు, డైలాగ్స్ లేకుండా మంచి చిత్రాలు చేస్తారని నమ్ముతున్నాను. ” అని అన్నారు.

Advertisement

“గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతోపాటు పుష్ప వంటి సినిమాలను ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. భోజ్ పురి ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. రాజ్ కుమార్ బర్జాత్యా, యష్ చోప్రా మంచి చిత్రాలను తీశారు. వారి సినిమాల్లో అసభ్యకరమైన కంటెంట్ ఉండదు. భోజ్ పురి కూడా మంచి సినిమాలను తీయాలి. రచయితలకు పారితోషికం ఇవ్వాలి.. హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి రచయితలకు, టెక్నీషియన్లకు తగ్గించకూడదు. ఇప్పుడు మలయాళీ సినిమాలు కూడా మంచిగా తీస్తున్నారు. ఇప్పుడు వారు ఎలా అగ్రస్థానంలో ఉన్నారో తెలుసుకోవాలి” అని అన్నారు.

Also Read : OPERATION VALENTINE MOVIE REVIEW : ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..?

Visitors Are Also Reading