Home » చంద్రముఖి ఫేమ్ నటుడు ప్రభుకి అస్వస్థత.. వైద్యులు ఏమన్నారంటే..?

చంద్రముఖి ఫేమ్ నటుడు ప్రభుకి అస్వస్థత.. వైద్యులు ఏమన్నారంటే..?

by Anji
Ad

సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రభు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుకి లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టుగా డాక్టర్లు వెల్లడించారు.

Advertisement

మరోవైపు రెండు రోజుల్లో ఆయనని డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ప్రభు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబాన్ని అడిగి తెలుసుకుంటున్నారు సినీ ప్రముఖులు. చివరిసారిగా ప్రభు విజయ్ దళపతి వారిసు సినిమాలో నటించారు. తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభు.. బాలనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షంగిలి సినిమాలో హీరోగా కనిపించారు ప్రభు. మొదటి సినిమాతోనే నటనపరంగా మెప్పించారు. 

Advertisement

Also Read :  పవన్ కళ్యాణ్ కి అస్వస్థత.. కారణం అదేనా..?

Manam News

ప్రభు 1980-90 దశకంలో హీరో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఎక్కువగా సహాయ నటుడి పాత్రల్లో కనిపిస్తున్నారు. తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించారు ప్రభు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించారు. అదేవిధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలోనూ కనిపించారు. కొద్ది రోజులుగా ప్రభు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం చెన్నైలోని కేలంబాక్కంలోని మేడ్వే ఆసుపత్రిలో చేరారు. యురేత్రోస్కోపీ అనే లేజర్ సర్జరీ ద్వారా మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్లను తొలగించారు. 

Also Read :  పెళ్లిలో చిరిగిన చొక్కాతో తాలిక‌ట్టిన మెగాస్టార్…దాని వెన‌క ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

Visitors Are Also Reading