ప్రస్తుతం ప్రతి రంగంలోనూ పురుషులకు స్త్రీలు పోటీ ఇస్తున్నారు. అంతే కాకుండా పురుషులను వెనక్కి నెట్టి మరీ మహిళలు అనేకరంగాలలో సత్తా చాటుతున్నారు. అయితే ఆచార్య చాణక్యుడు పురుషుల కంటే మహిళలు నాలుగు విషయాల్లో ముందుంటారని తన చాణక్యనీతిలో వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆ నాలుగు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం….సాధారణంగా పురుషులు స్త్రీల కంటే ధైర్యవంతులని అనుకుంటారు.
Advertisement
కానీ నిజానికి పురుషుల కంటే స్త్రీలే ధైర్యవంతులని ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో పేర్కొన్నాడు. ఎలాంటి పరిస్థితిని అయినా స్త్రీలు సమర్దవంతంగా ఎదురుకుంటారని పురుషుల కంటే ఆరు రెట్లు స్త్రీలు ధైర్యవంతులని పేర్కొన్నాడు. పురుషుల కంటే స్త్రీలు సున్నితమైన మనస్సు కలిగినవారు. వారి మనసు చిన్నవిషయాలకే నొచ్చుకుంటుంది.
Advertisement
అయితే పురుషుల కంటే స్త్రీలే తెలివైనవారని చాణక్యుడు పేర్కొన్నాడు. అంతే కాకుండా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ భావోద్వేగానికి లోనౌతారని చాణక్యుడు వెల్లడించారు. అయితే అది వారి బలహీనత కాదని అంతర్గత బలం అని పేర్కొన్నారు. అదే స్త్రీలను ఎలాంటి పరిస్థితిలో అయినా జీవించేలా చేస్తుందని చెప్పారు. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఆకలితో ఉంటారని చాణక్యుడు వెల్లడించారు. వారి శరీర నిర్మాణం వల్ల వారు ఎక్కువ ఆకలితో ఉంటారని చాణక్యులు పేర్కొన్నాడు.
ALSO READ : జనసేన కోసం రానున్న ‘ఆహా’ దిన పత్రిక… ఈ పత్రిక ధర ఎంతో తెలుసా!