ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్యంగా విల్ స్మిత్ వ్యాఖ్యాత క్రిస్ రాక్‌పై చేయిచేసుకోవడం పెద్ద దుమారం రేపింది. విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్ బోడిగుండు పై రాక్ సరదాగా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన స్మిత్ అతనిపై చేయి చేసుకున్న విషయం తెలిసినదే. ఈ విషయంపై అకాడమీ క్రమ శిక్షణ కమిటీ ఇటీవల సమావేశం అయింది. ఆ కమిటీ నిర్ణయం రాకముందే విల్ స్మిత్ తాను అకాడమీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. దానిని అకాడమీ సైతం ఆమోదించింది.
Also Read : ఎన్టీఆర్ ఎక్కువ టేకులు తీసుకున్న సినిమా ఏంటో తెలుసా..?
Advertisement
ఈ సందర్భంగా స్మిత్ తన చర్యలను తానే ఖండించుకున్నారు. తాను అలా ప్రవర్తించి ఉండకూడదని.. ఇది అకాడమీ నియమ నిబంధనలకు, గౌరవానికి హుందాతనానికి భంగం కలిగించినట్టేనని అంగీకరించాడు. తన చర్య వల్ల ఎంతో మంది ఆస్కార్ విజేతలు ఆ వేడుకలో ఆనందం పంచుకోలేక పోయారని వారికి ఇబ్బంది కలిగించినందుకు క్షమించమని వేడుకున్నారు. తన ప్రవర్తన కారణంగా అకాడమీ నమ్మకాన్ని వమ్ము చేశానని.. అది తనకెంతో బాధ కలిగిస్తోందని ఇకపై ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటాను అని విల్ పేర్కొన్నారు.
Advertisement
చిత్ర రంగంలోని సృజనకు కళాత్మకతకు అకాడమీ పెద్ద పీట వేస్తోందని తన కారణంగా గౌరవప్రదమైన అకాడమీకి ఎలాంటి ఇబ్బందులు కలగబోవు అని విల్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్‌ను అతనిపై జరిగిన దాడి విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటారా అని పోలీసులు అడిగారు. అందుకు రాక్ నిరాకరించడం గమనార్హం.
Also Read : దర్శకధీరుడు రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారన్న సంగతి తెలుసా.. ఏ సినిమా అంటే..!