కొంతమంది సెలబ్రెటీలు జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల వల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అలాంటి సెలబ్రెటీలలో హీరో వెంకట్ కూడా ఒకరు. వెంకట్ హీరోగా మరియు సపోర్టింగ్ పాత్రలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చిరంజీవి అన్నయ్య సినిమాలో చిరుకు తమ్ముడుగా నటించి మెప్పించాడు. ఆ తరవాత జగపతిబాబు నటించిన శివరామరాజు సినిమాలో ఆయనకు తమ్ముడుగా నటించాడు.
Advertisement
అలా వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్న వెంకట్ సడెన్ గా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇక రీసెంట్ వెంకట్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన సినిమాలకు ఎందుకు దూరం అయ్యాడో వెల్లడించాడు. ఆ నలుగురు సినిమా తరవాత ఆ ఐదుగురు సినిమా తీశారని చెప్పారు.
Advertisement
ఆ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తుండగా షూటింగ్ లో చిన్న ప్రమాదం జరగడంతో పై నుండి కిందపడిపోయానని చెప్పాడు. దాంతో వెన్నుపూసకు బలమైన గాయం తగిలిందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ తరవాత చాలా కాలం పాటూ రెస్ట్ తీసుకున్నానని చెప్పారు.
ALSO READ : అద్దె గర్భం ద్వారా పిల్లలను కన్న సెలబ్రెటీలు వీళ్లే..!
అంతే కాకుండా సినిమాలకు దూరం అయినప్పటికీ ఆ గ్యాప్ లో వ్యాపారం చేస్తూ ఉండేవాడినని అన్నారు. తనకు అవకాశాలు రాకపోవడం వల్ల దూరం అవ్వలేదని చిన్నవో పెద్దవో అవకాశాలు వస్తూనే ఉన్నాయని చెప్పారు. కానీ గాయం వల్ల నటించలేకపోయానని చెప్పారు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చానని మంచి ఆఫర్ లు వస్తే మరిన్ని సినిమాల్లో నటిస్తానని చెప్పారు.
ALSO READ :ఇండస్ట్రీలో ఆ ఇద్దరూ దిల్ రాజును తొక్కేస్తున్నారు…సంచలనం రేపుతున్న కేటీఆర్ కామెంట్స్..!