మల్లారెడ్డి ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కేవలం ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీ చైర్మెన్ గానే మల్లారెడ్డి తెలుసు. కానీ ఆయన టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా ఆ తరవాత మంత్రిగా ఎదిగారు. ఇక మంత్రిగా కంటే మల్లారెడ్డి తన ఫన్నీ స్పీచ్ లతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. అంతే కాకుండా మల్లారెడ్డి తన కుమారుడు కంటే కోడలు ప్రీతిరెడ్డి పైనే ఎక్కువ ప్రశంసలు కురిపిస్తుంటారు.
ALSO READ : భోజనానికి ముందు బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
Advertisement
తమ వ్యాపారాలను మరియు కుటుంబాన్ని ప్రీతిరెడ్డి చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని చెబుతుంటారు. దాంతో ప్రీతిరెడ్డి ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అని నెటిజన్ లు వెతికే పనిలో ఉన్నారు. మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి డాక్టర్ కాగా ఆయన డాక్టర్ ప్రీతిరెడ్డిని వివాహం చేసుకున్నాడు. ప్రీతి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ కు ఎండీ గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రీతిరెడ్డి నృత్యకారిణిగా కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.
Advertisement
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రీతిరెడ్డి మాట్లాడుతూ..తమ అత్తామామలు పెళ్లి తరవాత తనను కూతురులా చూసుకుంటున్నారని అన్నారు. అత్తమ్మను కూడా అమ్మ అనే పిలుస్తానని అన్నారు. 14 ఏళ్లు ఉండగానే తన తల్లి మరణించిందని ప్రీతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రెగ్నెన్సీ సమయంలో ఏ ఆడపిల్లకైనా తల్లి అవసరం ఉంటుందని కానీ ఆ లోటు లేకుండా కన్నతల్లిలా అత్తమ్మ చూసుకున్నారని అన్నారు. నోరు తెరిచి అడకముందే అన్నీ సమకూర్చేవారని చెప్పారు. దాంతో పట్టింటికి వెళ్లే అవసరం కూడా రాలేదని చాలా మంచివారని అన్నారు. అంతే కాకుండా యోగా చేయడం మంచి డైట్ తీసుకోవడం వల్ల మహిళలు దృడంగా ఉంటారని చెప్పారు.
ALSO READ : ఈ ఏడాది రేవంత్ రెడ్డికి కలిసొస్తుందా..? పంచాంగ కర్త ఏం చెప్పారో తెలుసా ?