సినిమా తారలు ఆఫర్ లు ఉన్నప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటారు. ఆ తరవాత జీవితంలో స్థిరపడెందుకు రెడీ అవుతారు. ఇక జీవితంలో స్థిరపడటం అంటే పెళ్లి చేసుకోవడం కూడా….ఈ నేపథ్యం లోనే సినిమాలకు గుడ్ బై చెప్పిన ఒక్కో హీరోయిన్ పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. కాగా తాజాగా రవితేజ హీరోయిన్ శియా గౌతమ్ కూడా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది.
Advertisement
శియా గౌతమ్ టాలీవుడ్ లో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. రవితేజ హీరోగా నటించిన నేనింతే సినిమా తో శియా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా తోనే అందం అభినయం తో ఆకట్టుకుంది. ఆ తరవాత శియా గౌతమ్ పలు సినిమా లలో నటించినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేకపోయింది.
Advertisement
వేదం సినిమా తో ఈ ముద్దుగుమ్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఆ తరవాత తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే శియా గౌతమ్ తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. అంతే కాకుండా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడం తో వైరల్ అవుతున్నాయి. శీయా పెళ్లికి హీరోయిన్ ప్రియమణి దంపతులు సైతం హాజరయ్యారు.
వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు మిఖాయిల్….అతడు ముంబై కి చెందిన వ్యాపారవేత్త. ఇక హీరోయిన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో నెటిజన్లు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also read : రామలింగయ్య లేకుంటే చిరును ఎన్టీఆర్ తొక్కేసేవారా.. జరిగింది ఏంటంటే ..?