తమిళ నటుడు, దర్శకుడు కే.భాగ్యరాజా 1987 లో రూపొందించిన ‘ఎంగ చిన్న రాజా’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులో భాగ్యరాజా సరసన రాధా నటించారు. ఇక తెలుగు విషయానికి వస్తే, ‘ఎంగ చిన్న రాజా’ చిత్రంలోని మదర్ సెంటిమెంట్ నచ్చి హీరో కృష్ణ తెలుగు రీమేక్ హక్కులు కొన్నారు. తను హీరోగా పద్మాలయ బ్యానర్ పై రీమేక్ చేయాలని అనుకున్నారు కృష్ణ. ఇందులో తల్లి పాత్రకు సీనియర్ నటి వాణిశ్రీని సంప్రదించారు.
READ ALSO : AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!
Advertisement
అయితే గతంలో నటి, దర్శకురాలు విజయనిర్మలతో ఏర్పడిన వివాదం కారణంగా హీరో కృష్ణతో సినిమా అనగానే వాణిశ్రీ అంగీకరించలేదు. ఈ ప్రాజెక్టు ఆమె వద్దనుకుంది. హీరో కృష్ణ, విజయశాంతి జంటగా అంతకు ముందు ‘నాగాస్త్రం’ చిత్రాన్ని నిర్మించిన నన్నపనేని సోదరులు అంకప్ప చౌదరి, అన్నారావు ‘ఎంగ చిన్న రాజా’ చిత్రాన్ని హీరో కృష్ణతో రీమేక్ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఎందువల్లనో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.
Advertisement
హీరో కృష్ణ డ్రాప్ అయ్యారని తెలియగానే నిర్మాత రాశి మూవీస్ అధినేత నరసింహారావు రూ.30 లక్షలకు పద్మాలయ వారి దగ్గర కొని ‘అబ్బాయిగారు’ పేరుతో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. ‘అబ్బాయిగారు’ చిత్ర ప్రారంభోత్సవానికి హీరో కృష్ణ హాజరయ్యారు. తొలి క్లాప్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘చంటి’ చిత్రం రికార్డులను ‘అబ్బాయిగారు’ క్రాస్ చేస్తుందని హీరో కృష్ణ అంటుండేవారు. 1993 సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ చెప్పినట్లుగానే కొన్ని ఏరియాల్లో ‘చంటి’ చిత్రాన్ని క్రాస్ చేసింది.
READ ALSO : భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!