క్రికెట్ లో చాలా మంది లెజెండర్స్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ నుంచి.. ఇప్పటి శుభ్ మన్ గిల్ వరకు చాలా మంది క్రికెటర్లు ఎంతో పేరు గాంచారు. అయితే.. ఇందులో దక్షిణాఫ్రికా ప్లేయర్ AB డివిలీయర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దక్షిణాఫ్రికాలో కంటే… ఇండియాలోనే AB డివిలీయర్స్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. AB డివిలీయర్స్ గ్రౌండ్ లోకి వచ్చాడంటే… గ్రౌండ్ నలుమూలలా ఫోర్లు, సిక్సులు కొడుతూ ఉంటాడు.
Advertisement
దీంతో AB డివిలీయర్స్ పేరు మిస్టర్ 360 ప్లేయర్ గా మారిపోయింది. AB డివిలీయర్స్.. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తరఫున కూడా ఆడి… అందరికీ ఎంటర్ టైన్ మెంట్ అందించాడు. అయితే.. 2018 ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్ కు 2021 లో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు AB డివిలీయర్స్. ఇక అప్పటి నుంచి.. రిటైర్మెంట్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు AB డివిలీయర్స్. ఇక ఇది ఇలా ఉండగా… AB డివిలీయర్స్ తాజాగా తన ఆరోగ్య సమస్యలపై సంచలన విషయాలు బయట పెట్టాడు. తనకు నిద్ర పట్టని సమస్య ఉందని… దాని వల్ల నరకం అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చాడు AB డివిలీయర్స్.
Advertisement
తనకు రాత్రి అయితే.. అస్సలు నిద్ర రాదని.. దాంతో స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు. 2013 సంవత్సరం నుంచి.. ఈ సమస్య తో బాధపడుతున్నానని చెప్పాడు AB డివిలీయర్స్. అంటే దాదాపు ఈ సమస్య 10 ఏళ్ల నుంచి నన్ను వేధిస్తుందన్నాడు. రేపు మ్యాచ్ అనగా.. ఇవాళ రాత్రి అస్సలు నిద్ర రాదని.. దాంతో స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పాక.. ఆ సమస్య కాస్త తగ్గిందని వివరించారు దక్షిణాఫ్రికా ప్లేయర్ AB డివిలీయర్స్. కానీ ఎవరూ కూడా స్లీపింగ్ పిల్స్ వాడొద్దని కోరాడు ఏబీడీ.
ఇవి కూడా చదవండి
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్
MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !