Home » ఆన్ లైన్ లో ఐఫోన్ ఆర్డర్ చేసిన యువకుడు.. డబ్బులు చెల్లించలేక ఏం చేశాడంటే..? 

ఆన్ లైన్ లో ఐఫోన్ ఆర్డర్ చేసిన యువకుడు.. డబ్బులు చెల్లించలేక ఏం చేశాడంటే..? 

by Anji
Ad

సాధారణంగా ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్క వినియోగానికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. మొబైల్స్ ని అయితే ఆఫ్ లైన్ కంటే.. ఆన్ లైన్ లో నే ఎక్కువగా గిరాకీ ఉంది. ఆన్ లైన్ లో కొన్ని ఆఫర్లు కూడా ఉంటున్నాయి. మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే బెంగళూరులో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. 

Advertisement

ముఖ్యంగా ఓ వ్యక్తి ఐ ఫోన్ పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆన్ లైన్ లో ఓ ఐఫోన్ ని ఆర్డర్ కూడా చేశాడు. కానీ తీరా అది డెలివరీ అయ్యే సమయానికి తన వద్ద డబ్బులు లేవనే విషయం తెలిసిపోయింది. రిటన్ పంపించడమో.. డోర్ లాక్ అనో సాకు చెప్పి తప్పించుకుంటే పోయేది. కానీ ఏకంగా ఏ సంబంధం లేని ఓ అమాయకుడి ప్రాణాలను తీశాడు. ఐఫోన్ ఇవ్వడానికి డెలివరీ బాయ్ ని Haత్య చేసాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. హాసన్ జిల్లా కి చెందిన హేమంత్ దత్ (20) ఆన్ లైన్ లో ఐఫోన్ ని సెకండ్ హ్యాండ్ లో రూ.46,000 కి బుక్ చేశాడు. డబ్బులు చెల్లించలేక డెలివరీ బాయ్ మంజు నాయక్ ని Haత్య చేసాడు. 

Advertisement

Also Read :  తారకరత్నకు తాత ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలుసా ? పిల్లల పేర్లలో కూడా..!

ఆ తరువాత బాధితుని మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి మూడు రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇక ఆ తరువాత రైల్వే ట్రాక్ వద్ద తగలబెట్టినట్టు దర్యాప్తులో వెల్లడి అయింది. మృతదేహాన్ని కాల్చడానికి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పెట్రోల్ కూడా కొన్నట్టు పోలీసులు వెల్లడించారు. రెండు, మూడు రోజుల నుంచి మంజు నాయక్ కనిపించకపోవడంతో బాధితుడి సోదరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల్లో హేమంత్ దత్ తన ద్విచక్ర వాహనంపై రైల్వే ట్రాక్ ల వైపు వెళ్లడం నమోదు అయింది. అదేవిధంగా ఓ పెట్రోల్ బంక్ లో హేమంత్ దత్ ఖాళీ సీసాలో పెట్రోల్ కొంటూ కూడా కనిపించాడు. దీంతో పోలీసులకు అతనిపై అనుమానం వచ్చి అరెస్ట్ చేసి విచారించాడు. ఐఫోన్ తీసుకోవడానికి తన వద్ద డబ్బులు లేకపోవడంతో తానే డెలివరీ బాయ్ పై కత్తితో దాడి చేసినట్టు అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. ఈ విషయం విని పోలీసులు సైతం ఆశ్చర్యపోవడం విశేషం. 

Also Read :  పిల్లల ముందు… తల్లిదండ్రులు అసలు చేయకూడని పనులు ఏంటో మీకు తెలుసా?

Visitors Are Also Reading