సాధారణంగా ప్రేమకు వయస్సుతో అస్సలు సంబంధం ఉండదు. వృత్తి అస్సలే సంబంధం ఉండదు. ఏ వయస్సు వారు ఎవరినైనా.. ఏ వృత్తి వారు ఎవరినైనా ప్రేమిస్తుంటారు. ప్రేమకు ముఖ్యంగా వయస్సు, ప్రాంతం, కులం, మతం వంటి తారతమ్యాలు ఏమి ఉండవు. అందుకు తగ్గట్టే నేటి యువత ప్రేమకు ఉన్న నిర్వచనాన్ని మార్చేసింది. ప్రస్తుతం కొత్త కొత్త ప్రేమ కథలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఓ వెరైటీ ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సాధారణంగా ప్రేమలో పడ్డ తరువాత ఈ ప్రపంచాన్నే మరిచిపోతుంటారు. ఈ ప్రేమ కథ గురించి చూసినట్టయితే.. బీహార్ లోని సమస్తిపూర్ లో నివసం ఉంటున్న 42 ఏళ్ల ఉపాధ్యాయుడు తన స్టూడెంట్ నే పెళ్లి చేసుకున్నాడు. స్టూడెంట్ వయస్సు కేవలం 24 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు 22 ఏళ్ల గ్యాప్ ఉండడం గమనార్హం. అయినప్పటికీ వారికి ఇది కనిపించలేదు. వీరి ప్రేమ కథకు కోచింగ్ సెంటర్ లో పునాది పడింది. ఉపాధ్యాయుడు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ లో ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఈ స్టూడెంట్ వచ్చింది.
Advertisement
42 साल के शिक्षक के प्यार में बावली हुई 20 साल की छात्रा, मंदिर में रचाई शादी#BiharNews | #HindiNews | #Trending | #SamastipurNews pic.twitter.com/h6wmgzSRj4
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) December 10, 2022
మాస్టర్ ఈ విద్యార్థినికి ఎలాంటి పాఠాలు చెప్పాడో తెలియదు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమ బంధాన్ని బలంగా మార్చుకోవాలనుకున్న వీరు తాజాగా ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. చుట్టు పక్కల వారు, కోచింగ్ సెంటర్ లో చదువుకుంటున్న విద్యార్థులు వీరి పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఉపాధ్యాయుడి మొదటి భార్య చాలా ఏళ్ల కిందటే మరణించింది. అతను రెండో పెళ్లి చేసుకోవడం ఇప్పటివరకు ఆసక్తి చూపలేదు. తాజాగా విద్యార్థినితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. విద్యార్థిని కూడా అంగీకరించడంతో వీరు ఏడడుగులు నడిచారు.
Also Read : బాలకృష్ణ వసుంధరల వివాహ పత్రికను మీరు చూశారా.. పెళ్లి ఎక్కడ జరిగిందంటే ?