చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌వేవ్..సెకండ్‌వేవ్.. థర్డ్‌వేవ్ ఇలా మూడు దశల్లో విజృంభించి ఎంతో మంది ప్రాణాలను తీసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా తగ్గుతున్న సందర్భంలో తాజాగా కొత్త రకం వేరియంట్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బ్రిటన్‌లో కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ వెలుగుచూసింది. తాజాగా భారత్‌లో కూడా వెలుగులోకి వచ్చింది. ముంబైలో తొలి కేసు నమోదు అయినట్టు బృమన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.
Advertisement
అదేవిధంగా కప్పా వేరియంట్ కూడా నమోదైనట్టు పేర్కొంది. ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితులలో ఇప్పటివరకు తీవ్ర లక్షణాలు ఏమి లేవు అని పేర్కొంది. సాధారణ కరోనా పరీక్షల్లో భాగంగా ముంబైకి చెందిన 230 మంది బాధితుల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించారు. వీటిలో 228 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయింది. ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్ఈ బయటపడింది. మొత్తం 230 మందిలో 21 మంది బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. వీరిలో ఆక్సిజన్ అవసరం రాలేదు.
Advertisement
ఆసుపత్రిలో చేరిన బాధితులలో 12 మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఏ1, బీఏ2ల మిశ్రమం ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఈ వేరియంట్ అధిక సాంక్రమిక శక్తి కలిగి ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే దాదాపు 10 శాతం ఎక్కువ వ్యాపించే గుణం ఉన్నట్టు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది భారత్‌లోకి తాజాగా చేరడంతో మరోసారి అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రజలను టెన్షన్ పెట్టిస్తోంది.
Also Read : మెగాస్టార్ గాడ్ ఫాదర్ విడుదల తేదీ ఖరారు.. మూడు సినిమాలు పోటీ..!