ప్రముఖ సెర్చింగ్ యాప్ గూగుల్ క్రోమ్ లో ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నుంచి క్రోమ్ బ్రౌజర్ నుంచి సైట్లను సందర్శించే సమయంలో పాస్ వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం ఈ కొత్త సదుపాయం అని చెప్పవచ్చు. ఇందుకు వీలుగా గూగుల్ పాస్ కీస్ ని ప్రవేశపెట్టింది. పాస్ కీ అనేది ప్రతీ యూజర్ కి ప్రత్యేకమైన ఐడెంటిటి తో కూడుకొని ఉంటుంది. వ్యక్తిగత కంప్యూటర్లు, ఫోన్లు లేదా యూఎస్బీ సెక్యూరిటీ డివైజ్ లలో స్టోర్ అవుతుంటాయి.
Advertisement
ఆన్ లైన్ లో మాత్రం ఎక్కడ కూడా స్టోర్ కావు. పాస్ వర్డ్ కీస్ ఇలా స్టోర్ అవ్వడం వల్ల ఆ తరువాత నుంచి వివిధ వెబ్ సైట్లు, యాప్ లలో పాస్ వర్డ్ అవసరం లేకుండా లాగిన్ అయిపోవచ్చు. ప్రతీ పోర్టల్ కి సంబంధించి యూజర్ పాస్ వర్డ్ లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. పాస్ వర్డ్ అన్నది ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపును దృవీకరించేందుకు అనధికారికంగా డేటాను మరొకరు పొందకుండా అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది. మామూలుగా పాస్ వర్డ్ తెలిసే అవకాశం ఉంటుంది.
Advertisement
పాస్ వర్డ్ కీస్ మరొకరికీ తెలిసే అవకాశం ఉండదు. సర్వర్ బ్రీచ్ అయినప్పటికీ ఈ పాస్ వర్డ్ కీస్ లీక్ కావు. ఫిషింగ్ దాడుల నుంచి యూజర్లకు రక్షణ ఉంటుంది అని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ లో పెట్టింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్యాటర్న్, పిన్ ద్వారా మనం ఫోన్ లో లాగిన్ అయినట్టుగా పాస్ కీస్ సాయంతో ఆన్ లైన్ పోర్టర్లలో లాగిన్ అయ్యేందుకు వీలు ఉంటుంది. గూగుల్ క్రోమ్ లో ఆండ్రాయిడ్, విండోస్ 11, మ్యాక్ ఓఎస్ యూజర్లకు పాస్ వర్డ్ కీస్ అందుబాటులో ఉంది. సైబర్ నేరగాళ్ల నుంచి రక్షించేందుకు ఈ ఫీచర్ ని అందిస్తున్నట్టు తెలిపారు.
Also Read : My Story నాకు 40., తనకు 20.! ఇది మా స్టోరి!