Home » చైనాలో వింత.. తోకతో జన్మించిన శిశువు..!

చైనాలో వింత.. తోకతో జన్మించిన శిశువు..!

by Anji
Published: Last Updated on
Ad

చైనాలో అరుదైన ఘటన జరిగింది. ఓ మగ శిశువు తోకతో జన్మించాడు. హాంగ్‌ఝౌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో జన్మించిన ఈ శిశువును చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయా రు. దాదాపు 10 సెంటీమీటర్ల(3.9 ఇంచులు) పొడవుతో మృదువుగా, ఎలాంటి ఎముక లే కుండా ఈ తోక ఉంది. దీనిని టెథర్డ్‌ స్పైనల్‌ కార్డ్‌ అంటారని వైద్యులు తెలిపారు.

Advertisement

Advertisement

వెన్నెముక చివరి భాగం.. చుట్టుపక్కల ఉండే కణజలంతో అనుసంధానం అయినందున టెథర్డ్‌ స్పైనల్‌ కార్డ్‌ ఏర్పడిందని చెప్పారు. తోకతో జన్మించిన శిశువును చూసి ఆందోళన చెందిన తల్లి.. సర్జరీ చేసి తొలగించాల్సిందిగా డాక్టర్లను కోరారు. అయితే, ఇది బాలుడి నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున తొలగిస్తే సమస్యలు రావొచ్చని వైద్యులు భావిస్తున్నారు. గత జూన్‌లో దక్షిణ అ మెరికాలోని గయానాలో కూడా ఒక శిశువు ఇలాగే జన్మించగా సర్జరీ చేసి తొలగించారు.

Also Read : మా తండ్రి వల్లనే ఇంట్లో నుంచి పారిపోయాను.. రవి కిషన్ కామెంట్స్ వైరల్..!

Visitors Are Also Reading