మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు మూవీ అక్టోబర్ 20న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ మిశ్రమ టాక్ సంపాదించుకుంది. వంశీ దర్శకత్వం వహించిన తెలుగు పీరియడ్ త్రిల్లర్ మూవీలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ కేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్త, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.
Advertisement
ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ ఎంట్రీ సీన్ అదిరిపోయిందనే చెప్పాలి. యాక్షన్ సన్నివేశాలు సూపర్ అంటూ.. సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ వచ్చాయి. కానీ టాలీవుడ్ ఆశించిన థియేటర్లు లభించకపోవడం.. విజయ్ లియో, బాలయ్య భగవంత్ కేసరి మూవీస్ తో టైగర్ నాగేశ్వర్ రావు మూవీకి కాస్త ఎఫెక్ట్ పడినట్టు కనిపిస్తోంది. మరోవైపు సినిమా కూడా సాగదీతగా ఉండటంతో ప్రేక్షకుల్లో కాస్త నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కొంత మంది టైగర్ నాగేశ్వర్ రావు మూవీని వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Advertisement
ఇక ఇదిలా ఉంటే.. టైగర్ నాగేశ్వర్ రావు మూవీ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జానీ మూవీ తరువాత ఆమె నటించిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. అయితే వాస్తవానికి ఈ రోల్ లో దర్శకుడు ముందుగా రమ్యకృష్ణను అనుకున్నారట. రేణు దేశాయ్ హేమలత లవణం అనే సామాజిక సంఘసంస్కర్త పాత్రలో కీ రోల్ పోషించారు. అయితే వాస్తవానికి ఈ పాత్ర ముందుగా రమ్యకృష్ణ కోసం అనుకున్నారట. కానీ రమ్యకృష్ణ ఈ కథ కాంట్రవర్సియల్ గా మారుతుంది అనుకోని మూవీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
- మరిన్ని Telugu news మరియు తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చదవండి !