నిద్రపోవడానికి ముందు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. చాలామంది ఎక్కువగా ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ అసలు ఈ పొరపాట్లు చేయకండి. నిద్రపోవడానికి ముందు వీడియో గేమ్స్ వంటివి ఆడితే మానసిక ఆందోళన కలుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. రాత్రి నిద్ర పోవడానికి గంట ముందే మొబైల్ ఫోన్ అలానే ఎలక్ట్రానిక్ పరికరాలని ఆఫ్ చేయండి. లేదంటే నిద్ర పట్టదు.
Advertisement
Advertisement
సాయంత్రం పూట టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, సిగరెట్లు వంటివి తీసుకోవడం మంచిది కాదు అలానే రాత్రి నిద్రపోవడానికి ముందు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకండి. కడుపులో అసౌకర్యం కలుగుతుంది. రాత్రిపూట ఆల్కహాల్ తీసుకోవడం వలన నిద్ర పట్టదు. పడుకునే ముందు టెన్షన్ కలిగించే విషయాలని మాట్లాడుకోవద్దు. పడుకునే ముందు వీలైనంత తక్కువ లిక్విడ్స్ ని తీసుకోండి. లేదంటే మధ్య మధ్యలో లేవాల్సి వస్తుంది ఇలా ఈ పొరపాట్లు నిద్రపోవడానికి ముందు జరగకుండా చూసుకోండి లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడాలి.
Also read:
- ఎలా LCU ని లియో ని కనెక్ట్ చేసారు…? ఈ ట్విస్ట్ ని మీరు కూడా గమనించారా..?
- ఈ లక్షణాలు ఉన్న భార్య వస్తే.. ఇక అంతా సంతోషమే..!
- ఫేక్ కాల్స్ ని తట్టుకోలేక.. మౌనిక షాకింగ్ నిర్ణయం.. ఆఖరికి..?