Home » ఎలా LCU ని లియో ని కనెక్ట్ చేసారు…? ఈ ట్విస్ట్ ని మీరు కూడా గమనించారా..?

ఎలా LCU ని లియో ని కనెక్ట్ చేసారు…? ఈ ట్విస్ట్ ని మీరు కూడా గమనించారా..?

by Sravya
Ad

కార్తి హీరోగా వచ్చిన లియో సినిమా గురువారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎల్సియు భాగంగానే, సినిమా తెర మీదకి వచ్చింది. అయితే ఎల్సియు తో ఈ సినిమాని ఎలా లింక్ చేశారు..? ఖైదీ, విక్రమ్ తో లియోని ఎక్కడ కనెక్ట్ చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు నెపోలియన్ లియోలోకి ఎంట్రీ ఎలా ఇచ్చాడు..? ఎక్కడో తిరుచ్చి లో డ్రగ్స్ పట్టు పడితే అక్కడ నుండి హిమాచల్ ప్రదేశ్ కి అతని ఎలా వచ్చాడు అనే సందేహం ఉండొచ్చు. ఖైదీ, విక్రమ్ లకి లింక్ టు డ్రగ్ కంటైనర్స్. ఒకటి విజయ్ హ్యాండిల్ చేస్తే ఇంకోటి విక్రమ్ కొడుకు ప్రభంజన్ హ్యాండిల్ చేస్తుంటాడు.

Leo Movie Review

Leo Movie

ఆ డ్రగ్ అరెస్ట్ వల్ల ప్రభంజన్ చనిపోతాడు విజయ్ ఫ్యామిలీని కోల్పోతాడు అప్పుడు విక్రమ్ రంగంలోకి వస్తాడు. ఇదంతా మనం చూసాం. విక్రమ్ నుండి ఎల్సీయూకి లింక్ చేసే ఆ సీన్ ని లోకేష్ తీసేసారు. ఎప్పుడైతే అమర్ గోస్ట్ గురించి స్పీచ్ స్టార్ట్ చేస్తాడో అప్పుడే ఒక ఆఫీసర్ పక్క రూమ్ కి వెళ్లి మిషన్ గన్ చూస్తాడు. అంత మందిని ఎదిరించింది నువ్వా అని అడుగుతాడు అప్పుడు అక్కడ కెమెరా తిప్పితే అతను నెపోలియన్. నెపోలియన్ గన్ ని పట్టుకోలేడు. కట్ చేస్తే అక్కడ నుండి మళ్ళీ అమర్ దగ్గరికి ఆఫీసర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు తెలిసిందా తిరుచి డ్రగ్ ఇష్యూ తర్వాతనే నెపోలియన్ వచ్చేది.

Advertisement

విక్రంలోని నెపోలియన్ కి ఆఖరి 60 రోజుల పోస్టింగ్ హిమాచల్ ప్రదేశ్ లో లియో వద్ద వస్తుంది ఇక్కడ లియో కి నెపోలియన్ పేపర్ కటింగ్ చూపిస్తాడు. అది తమిళంలో ఉంటుంది. ఇన్సిడెంట్ తిరుచిలో జరిగింది కాబట్టి అలా తమిళ్ లోనే వదిలేసారు. తెలంగాణ గురించి వచ్చినప్పుడు తెలుగులో చూపించారు. ఢిల్లీ ఉపయోగించిన మిషన్ గన్ తో పాటు నెపోలియన్ ఫోటో కూడా ఉంటుంది. నెపోలియన్ మిషన్ గన్ ఎలా లేపాడు లియో అడుగుతాడు. ఇక్కడే ఢిల్లీ రిఫరెన్స్ మళ్ళీ వస్తుంది.

Advertisement

ఎల్సీయూలో నెక్స్ట్ ఖైదీ టు వస్తుంది ఇక సినిమాలో నెపోలియన్ కి సరైన సీన్స్ పడ్డాయి ఎలివేషన్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. క్లైమాక్స్లో ఇక లియో ఐడెంటిటీ ఎవరికీ కూడా తెలియదు అన్నప్పుడు ఒక కాల్ వస్తుంది. అది విక్రం నుండి ఎల్సియు లింక్ ఏంటి ఇలా చూపించారు అని మీరు అనుకోవచ్చు. ఆ టైంలో నేనెవరో తెలుసు కదా అని విక్రమ్ డైలాగ్ వస్తుంది. లియో కి విక్రం కి లింక్ ఏంటి అనే విషయాన్ని రివీల్ చేయలేరు. ఫ్యూచర్ లో రివిల్ చేసే ఛాన్స్ ఉంది. విక్రం పాత గ్యాంగ్ చనిపోవడంతో కొత్త గ్యాంగ్ క్రియేట్ చేస్తున్నాడు అలానే అమ్మాయి కూడా ఉంది. ఆమె స్టోరీ ఎల్ సి యు లో కంటిన్యూ అవ్వచ్చు. క్లైమాక్స్లో రోలెక్స్ బిజిఎం ని వదిలి మైండ్ బ్లాక్ చేసేసారు. సో దీని ప్రకారం లియో విక్రములకు ముందు నుండి పరిచయం ఉంది ఇప్పుడు నెపోలియన్ కూడా లియో పక్కనే ఉన్నాడు. మళ్లీ నెక్స్ట్ వచ్చే పార్ట్ లో విజయ్ తో పాటు పక్కాగా ఢిల్లీ కూడా రావచ్చు. విక్రంతో కలిసి రోలెక్స్ ని వీళ్ళందరూ ఎలా ఎదిరిస్తారు వంటివి లోకేష్ ప్రశ్నలు గా వదిలేశారు.

Also read:

Visitors Are Also Reading