విరాట్ కోహ్లీ సెంచరీ కొడుతుంటే చూడాలని కోరుకొని వాళ్ళు ఎవరుంటారు. తన ప్రత్యేకమైన ఆటలతో ప్రత్యర్థి బౌలర్లను సైతం నోరు వెళ్ళబెట్టేలా, ఎంపైర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆడే తీరు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లకు సొంతం. అచ్చం ఇలాంటి ఘటనే నిన్న జరిగాయి. విరాట్ ఇప్పుడు సెంచరీపై దృష్టి పెట్టాడు. వరల్డ్ కప్ విజయాల్లో తన కాంట్రిబ్యూషన్ వీలైనంత పెద్దగా ఉండేలా చూసుకుంటానని చెబుతున్న కోహ్లీ అందుకోసం టీం మేట్స్ హెల్ప్ తీసుకోవడానికి కూడా ఆలోచించడం లేదు. టీం మేట్స్ కోహ్లీ కోసం ఆ చిన్నపాటి త్యాగాన్ని చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అలా ఈ వరల్డ్ కప్ లోనే రెండుసార్లు తోటి బ్యాటర్లు విరాట్ ను తన వ్యక్తిగత మైల్డ్ స్టోన్ పెంచుకునేందుకు సహాయం చేశారు.
బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో తోటి ప్లేయర్లతోపాటు ఎంపైర్ కూడా సహాయం చేశాడు. ఇన్నింగ్స్ లో 38.2 ఓవర్ దగ్గర నుంచి 41.3 ఓవర్ల వరకు కోహ్లీనే ఆడాడు. 39.3 ఓవర్ వద్ద సింగిల్ తీసే అవకాశం ఉన్న కేఎల్ రాహుల్ సింగిల్ తీయడానికి ఇష్టపడలేదు. నువ్వే బ్యాటింగ్ చెయ్ సెంచరీ కంప్లీట్ చెయ్ అన్నట్లుగా కోహ్లీకి ఛాన్స్ ఇచ్చాడు. రాహుల్ తర్వాత బంతికే సిక్స్ కొట్టిన కోహ్లీ ఆఖరి బంతికి సింగిల్ తీసి స్ట్రైకింగ్ తన వద్ద ఉంచుకున్నాడు. మళ్ళీ 41.1 ఓవర్ వచ్చేసరికి ఒక్క పరుగు చేస్తే టీమిండియా గెలిచిపోయినట్లే. బంగ్లా బౌలర్ మహమ్మద్ బంతిని డౌన్ లోకి వేశారు. ఏ ఎంపైర్ అయిన వైడ్ ఇచ్చేవాడే. కానీ ఎందుకో తెలియదు ఈ ఎంపైర్ వైడ్ ఇవ్వలేదు. ఎంపైర్ కూడా కోహ్లీ సెంచరీ చేయాలని కోరుకున్నాడేమో.. ఆ తర్వాత బంతికి సిక్సర్ కొట్టి కోహ్లీ తన వన్డే కెరియర్ లో 48వ సెంచరీని పూర్తి చేశాడు.
Advertisement
Advertisement
కేవలం ఈ మ్యాచ్ లోనే కాదు 11వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన మ్యాచ్ లో కూడా అదే జరిగింది. చివరిబంతి స్ట్రైకింగ్ కోహ్లీకి వస్తే హాఫ్ సెంచరీ చేసుకోవచ్చు. అందుకే అయ్యర్ ను స్ట్రైక్ తనకు ఇవ్వమని అడిగాడు. మొత్తంగా ఈసారి కోహ్లీ వరల్డ్ కప్ లో విజయాలు మాత్రమే కాకుండా వాటిలో తన భాగస్వామ్యాలు కూడా పెద్దగా ఉండేలా ప్లాన్ చూసుకుంటున్నాడు. తప్పులేదు ఓ క్రికెటర్ కు ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది స్కోర్ కార్డ్సే. ఎన్ని సెంచరీలు చేశారు, ఎన్ని ఆప్ సెంచరీలు కొట్టారు అనేది ముఖ్యం. కోహ్లీ సెంచరీలు కొట్టాలని, రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ మాత్రమే కాదు తోటి ఆటగాళ్లు కూడా కోరుకుంటున్నారు అన్నమాట.
ఇవి కూడా చదవండి
- Shubman Gill : గిల్ ను గోకుతున్న సచిన్ కూతురు..గ్రౌండ్ కు వచ్చి !
- Tiger Nageswara Rao review : “టైగర్ నాగేశ్వరరావు” రివ్యూ..మాస్ ఫ్యాన్స్ కు జాతరే
- కేటీఆర్ ను ఓడించేందుకు డబ్బులు పంపించిన జగన్..?