మనం పండ్లను తినేటప్పుడు తొక్కాలని పారేస్తూ ఉంటాము. కానీ తొక్కలలో కూడా పలు ఉపయోగాలు ఉంటాయి. నారింజ తొక్కలులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చగలవు. నారింజ తోక్కని పొడి చేసుకుని పసుపు, తేనె కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ముఖం మెడ ప్రాంతంలో ఈ పౌడర్ ని అప్లై చేసి పది నిమిషాలు వదిలేసి తర్వాత కడిగేసుకుంటే మరింత అందంగా కనపడతారు. నిమ్మ తొక్క కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మ తొక్క పొడి చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు బ్రౌన్ షుగర్, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసి పేస్ట్ లాగ చేసుకుని ముఖం మెడకి అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే, చర్మం ఎంతో అందంగా మారుతుంది.
Advertisement
Advertisement
ఆపిల్ తొక్క కూడా బాగా ఉపయోగపడుతుంది ఆపిల్ తోక్కలను పొడి కింద చేసుకొని అందులో పెరుగు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. అరటి తొక్క తీసుకుని వాటిని గుజ్జులా చేసుకోండి. ఇందులో కోడిగుడ్డు పచ్చ సోన వేసి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని కడిగేసుకుంటే ముడతలు రాకుండా ఉంటాయి. బొప్పాయి తొక్క కూడా అందాన్ని పెంపొందిస్తుంది. అవకాడో తొక్క కూడా అందాన్ని పెంపొందిస్తుంది. మామిడి తొక్కతో కూడా అందాన్ని పెంచుకోవచ్చు ఇలా ఈ పండ్లు తొక్కలతో మరింత అందంగా మారవచ్చు.
Also read:
- చాణక్య నీతి: ఈ విషయాల్లో జాగ్రత్తగా వుండండి.. లేదంటే లైఫ్ సర్వనాశనం అయిపోతుంది..!
- పాలు పొంగిపోకుండా ఉండాలంటే.. ఈ చిట్కా ని ఫాలో అవ్వండి…!
- ఈ మసాలానని తీసుకుంటే.. ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి…!