ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది. బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ట్రోఫీ గెలవడంలో షేన్ బాండ్ కీలక పాత్ర పోషించాడు. 2017లో ముంబై ఇండియన్స్ కు బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన షేన్ బాండ్ 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిల్ విజయాలలో భాగమయ్యాడు. ఫ్రాంచైజీ చరిత్రలో అత్యుత్తమ కోచ్ లలో షేన్ బాండ్ రికార్డు క్రియేట్ చేశాడు.
ఇతని రాజీనామాతో ముంబై ఇండియన్స్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పాత్రను పోషించే బలమైన కోచ్ కోసం ముంబై ఇండియన్స్ ఎదురుచూస్తోంది. అయితే గతంలో ముంబై ఇండియన్స్ శ్రీలంక దిగ్గజ పెసర్ ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ రసక్ మలింగను బౌలింగ్ కోచ్ గా నియమించింది. అయితే ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించలేదు. గతంలో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన రసక్ మలింగ 2021లో వీడ్కోలు పలికాడు.
Advertisement
Advertisement
2022 సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ గా సేవలు అందిస్తున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ నాలుగు ఐపిఎల్ టైటిల్స్ గెలవడంలో మలింగ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు కీలక ఆటగాలను కోల్పోయి బలహీనంగా తయారయ్యింది. గత ఐపీఎల్ పోరులో ముంబై ఇండియన్స్ ఫైనల్ కు కూడా చేరుకోలేకపోయింది. 2023 ఐపీఎల్ లో ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదవసారి టైటిల్ గెలిచి ముంబై ఇండియన్స్ రికార్డులను సమం చేసింది.
ఇవి కూడా చదవండి
- పుష్ప-2 సినిమాలో చిరంజీవి..బన్నీ క్రేజీ ప్లాన్
- టీమిండియాను ఓడిస్తే, డేట్ చేస్తా… బంగ్లా ఆటగాళ్లకు పాక్ నటి ఆఫర్
- Leo Movie Review : లియో మూవీ రివ్యూ