క్రికెట్ లో దూకుడు అవసరం. ప్రత్యర్థులను భయపెట్టడానికి బాగుంటుంది కానీ క్రిజ్ బయట అంత దూకుడుగా ఉంటే అది చాలా చాలా డేంజరస్. సరిగ్గా ఇలాంటి అనుభవమే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఎదురైంది. కూల్ గానే కనిపిస్తాడు ఎవరితో గొడవ పెట్టుకొని ఉంటాడు అని ఆలోచిస్తున్నారా? ఇది అలాంటి వివాదం కాదు. బంగ్లాదేశ్ తో ప్రపంచకప్ మ్యాచ్ కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పీడ్ డ్రైవింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.
ముంబై, పూణే మధ్య రద్దీగా ఉండే హైవే మీద రోహిత్ శర్మ నడుపుతున్న లంబోర్ఘిని కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడాన్ని పోలీసులు గుర్తించారు. ఒకానొక దశలో ఈ కారు అత్యధికంగా 215 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా అందుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారును నడిపినందుకు డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు పోలీసులు మూడు చలానాలను పంపించారు.
Advertisement
Advertisement
గత ఏడాది డిసెంబర్లో కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దీనివల్ల అతని కెరీర్ కు దాదాపు ఏడాదిన్నర నుంచి రెండేళ్లపాటు బ్రేక్ పడింది. ఇలాంటి ఘటనలను గుర్తుపెట్టుకుని కారు డ్రైవింగ్ చేసే వాళ్ళు వేగాన్ని అదుపులో ఉంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- పుష్ప-2 సినిమాలో చిరంజీవి..బన్నీ క్రేజీ ప్లాన్
- టీమిండియాను ఓడిస్తే, డేట్ చేస్తా… బంగ్లా ఆటగాళ్లకు పాక్ నటి ఆఫర్
- Leo Movie Review : లియో మూవీ రివ్యూ