బిగ్ బాస్ 7 కార్యక్రమంలోకి కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అయితే రైతు బిడ్డగా వెళ్ళినటువంటి ప్రశాంత్ పట్ల మొదటి నుంచి హౌస్ లో చులకన భావంతో చూస్తున్నారు. గత ఐదు వారాల నుంచి అమర్ పల్లవి ప్రశాంత్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే తాజాగా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వెళ్లినటువంటి వారిలో అర్జున్ అంబటి కూడా ఒకరు. ఇక ఈయన కూడా పల్లవి ప్రశాంత్ పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడటంతో ఒక్కసారిగా ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే..
బిగ్ బాస్ హౌస్ లో రైతు బిడ్డగా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ హౌస్ లో శివాజీ చెప్పే మాట తప్ప ఎవరి మాటలను వినడు. కానీ అర్జున్ తనకు ఏదో సలహా ఇస్తే పల్లవి ప్రశాంత్ దానిని లైట్ గా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో అర్జున్ పట్టరాని కోపంతో ఊగిపోయి పల్లవి ప్రశాంత్ పై ఉన్నటువంటి విషం మొత్తం బయటకు వెళ్లగక్కాడు. అనంతరం గౌతమ్ దగ్గర అర్జున్ కూర్చొని పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ ఆ ఎర్రి పుష్పం గాడికి ఒక సలహా ఇస్తే లైట్ తీసుకున్నాడు. ఏదైనా టాస్క్ పడని చెప్తా. మొన్న కలర్ టాస్క్ లో మొత్తం మడత పెట్టాల్సి ఉంది. ఎందుకు వదిలేసావు. టాస్క్ లో మడత పెట్టేయాల్సింది. అప్పుడు వీడు ఆడుతాడు వీడు ఆడుతాడు అనే మాట ఎగిరిపోయి ఉండేది.
ఈ విధంగా అర్జున్ గౌతమ్ దగ్గర పల్లవి ప్రశాంత్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు పల్లవి ప్రశాంత్ పై ఎందుకు మీకు అంత కోపం అంటూ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం నీ కన్నా అమర్ ఎంతో బెటర్. ఐదు వారాలపాటు హౌస్ లో పల్లవి ప్రశాంత్ కొనసాగుతూ అందరికీ పోటీగా నిలిచి మొదటి కెప్టెన్ అయ్యారు. ఐదు వారల తర్వాత బయట నుంచి నువ్వు వచ్చి ఇప్పుడు తనని మడత పెట్టేయాల్సింది అంటావా నువ్వు తొందరలోనే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతావు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్ కు మరింత మద్దతు పెరిగింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
టైగర్ నాగేశ్వర రావు’ మూవీలో రేణుదేశాయి ఏ పాత్రలో నటిస్తుందో మీకు తెలుసా ?