Home » తెలంగాణ నిరుద్యోగులకు మరో షాక్.. డీఎస్సీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

తెలంగాణ నిరుద్యోగులకు మరో షాక్.. డీఎస్సీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

by Anji

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అయోమయంలో పడింది. కొద్ది రోజులు నోటిఫికేషన్ లు రాక నిరుద్యోగులు ఇబ్బంది పడితే.. మరికొద్ది రోజులు నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలను అమ్ముకొని.. పేపర్ లీక్ వ్యవహారం నిరుద్యోగులకు చాలా బాధ కలిగించింది. కష్టపడి చదువుకునే విద్యార్థుల పాలిట పేపర్ లీకేజ్ యమపాశంలా వెంట పడింది. పేపర్ లీకేజీ వ్యవహారం తరువాత గ్రూపు 1 పరీక్ష పెడితే.. మళ్లీ ఆ పరీక్ష బయోమెట్రిక్ కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. ఇలా టీఎస్పీఎస్సీ నిరుద్యోగులతో ఆటలాడుకుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఉపాధ్యాయుల నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

దీనిని  అరకొర పోస్టులతో ఏదో తూతూ మంత్రంగా  నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. కేవలం 5 వేల పోస్టులను మాత్రమే నోటీపై చేశారు. ఈ నోటిఫికేషన్ పై బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ముందు విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పరీక్ష పూర్తవుతుందా? లేదా అనే  అనుమానాలు వ్యక్తమయ్యాయి.  అందరూ అనుకున్నట్టుగానే తాజాగా ఎన్నికల తరువాత డీఎస్సీ పరీక్ష ఉంటుందని ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రధానంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో తెలంగాణలో ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షను టిఎస్పీఎస్సీ వాయిదా వేసింది. తాజాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా పడింది. నవంబర్ 20 నుంచి 30 వరకు జరగాల్సిన డీఎస్సీ రాత పరీక్షను వాయిదా వేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది.

రాత పరీక్షల షెడ్యూల్ ను అతి త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ  వాయిదా వేసినట్టు తెలిపింది. తెలంగాణలో అసెంబ్లీకి సంబంధించి నవంబర్ 30న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 8న విడుదల చేసింది. మొత్తం 5,082 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, పీఈటీ పోస్టులు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంది. నవంబర్ 20, 21న స్కూల్ అసిస్టెంట్లు, నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్, నవంబర్ 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నవంబర్ 24న లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు రెండు విడతల్లోనూ నవంబర్ 25 నుంచి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్ ప్రకటించారు.  అకస్మాత్తుగా నవంబర్ 30న  పోలింగ్ ఉండటంతో ఈ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చి వాయిదా వేశారు.  సంక్రాంతి పండుగ తరువాత జనవరి 20 తరువాత నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

లెమన్ గ్రాస్ టీ తాగితే ఒత్తిడి,కిడ్నీ, చర్మ సమస్యలు మటు మాయం..!

 ల‌వ‌ర్ కోసం క‌లెక్ట‌ర్ అయ్యాడు.! కోట్ల జీతం వ‌దిలి కొత్త జీవితంలోకి….!

Visitors Are Also Reading