ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోజు బాగుండాలని అనుకుంటుంటారు. కానీ రోజుని అందంగా మార్చుకోలేకపోతుంటారు. రోజు అందంగా మారాలంటే ఈ విషయాలను పాటిస్తే మంచిది ఇలా కనుక చేశారంటే కచ్చితంగా రోజు చాలా అందంగా మారుతుంది మరి మనం మన రోజుని ఎలా అందంగా మార్చుకోవాలి..? ఏ ఏ విషయాలను ప్రతిరోజూ పాటిస్తే మంచిది అని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఫోన్ కి దూరంగా ఉండాలి ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడడం వలన ఒత్తిడి పెరిగిపోతుంది. రోజు బాగుండాలంటే లేవగానే నెమ్మదిగా కాలివేళ్లని కదపాలి. కొంచెం లోతుగా శ్వాసని తీసుకోండి.
Advertisement
Advertisement
అలానే రోజు బాగుండాలి అంటే మంచి ప్లాన్ కూడా చాలా అవసరం. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మీ పనులను మీరు సరిగ్గా టైం కి చేసుకోగలుగుతారు. ఉదయం పూట 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేస్తే రోజు ఎంతో బాగుంటుంది. అల్పాహారాన్ని ఆస్వాదిస్తూ తినడం కూడా చాలా మంచి పద్ధతి. నెమ్మదిగా తింటూ రోజున స్టార్ట్ చేయండి. కాసేపు ప్రశాంతంగా వాకింగ్ చేస్తే కూడా రోజు చాలా బాగుంటుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది ఆఫీస్ కి టైం అవుతోందనో లేదంటే కాలేజీకి టైం అయిపోతుంది అని ఇలా ఎవరి పనిలో వాళ్ళు పడిపోయి కంగారు కంగారుగా రోజును మొదలు పెడుతూ ఉంటారు. అలా చేయడం కంటే ఇలా రోజులు మొదలు పెట్టడం మంచిది.
Also read:
- వీటిని రెగ్యులర్ గా తీసుకోండి… ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి…!
- God Movie Review : గాడ్ మూవీ రివ్యూ
- బిగ్ బాస్ తెలుగు: డేంజర్ లో ఇద్దరు ఆటగాళ్లు.. ఈ వారం ఇంటి నుండి వెళ్లిపోయేది ఎవరంటే..?